ETV Bharat / business

రూ.82 లక్షల కోట్లకు అదానీ గ్రూప్ విలువ!.. భారీగా కొత్త పెట్టుబడులు - అదానీ పెట్టుబడులు

అపర కుబేరుడు గౌతమ్‌ అదానీ 150 బిలియన్‌ డాలర్లు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. తమ గ్రూప్‌ విలువను లక్ష కోట్ల డాలర్ల (సుమారు రూ.82 లక్షల కోట్ల)కు చేర్చాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ADANI GROUP
ADANI GROUP
author img

By

Published : Oct 31, 2022, 7:35 AM IST

ఆసియా కుబేరుల్లో అగ్రస్థానంలో ఉన్న గౌతమ్‌ అదానీ, తమ గ్రూప్‌ విలువను లక్ష కోట్ల డాలర్ల (సుమారు రూ.82 లక్షల కోట్ల)కు చేర్చాలనే లక్ష్యంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం తాజాగా 150 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.12.30 లక్షల కోట్ల) పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు సంస్థ సీఎఫ్‌ఓ సింగ్‌ తెలిపారు. 1988లో ట్రేడింగ్‌తో ప్రారంభమైన అదానీ.. నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు, రహదారులు, గనులు, విద్యుత్‌, పునరుత్పాదక ఇంధనం, విద్యుత్‌ పంపిణీ, గ్యాస్‌ పంపిణీ, ఎఫ్‌ఎంసీజీతో పాటు డేటా కేంద్రాల్లోకి విస్తరించారు. పెట్రోరసాయనాలు, సిమెంట్‌, మీడియా రంగాల్లోనూ అదానీ గ్రూప్‌ పెద్దఎత్తున అడుగుపెట్టింది.

హరిత హైడ్రోజన్‌ వ్యాపారంలో 50-70 బి.డాలర్ల పెట్టుబడి పెట్టే ప్రణాళికలో సంస్థ ఉంది. దీనికి అదనంగా వచ్చే 5-10 ఏళ్లలో మరో 23 బి.డా. పెట్టుబడుల్ని హరిత ఇంధన వ్యాపారంలో పెట్టాలనుకుంటోంది. విద్యుత్‌ పంపిణీ వ్యాపారంపై 7 బి.డా., రవాణా యుటిలిటీపై 12 బి.డా., రహదారి రంగంపై 5 బి.డా. చొప్పున పెట్టుబడులు పెట్టేందుకు సన్నద్ధమవుతోంది.

  • క్లౌడ్‌ సేవలతో కూడిన డేటా కేంద్రాల వ్యాపారంలో అడుగుపెట్టిన అదానీ గ్రూప్‌, ఎడ్జ్‌ కనెక్స్‌ భాగస్వామ్యంతో 6.5 బి.డాలర్ల పెట్టుబడులు పెడుతోంది. విమానాశ్రయాలపై 9-10 బి.డాలర్లు పెట్టాలనుకుంటోంది.
  • ఏసీసీ, అంబుజా సిమెంట్స్‌లను 10 బి.డా.తో సొంతం చేసుకోవడం ద్వారా సిమెంట్‌ వ్యాపారంలోకి అడుగుపెట్టింది.
  • పెట్రోరసాయనాల వ్యాపారంలో భాగమైన పీవీసీ తయారీ యూనిట్‌ను 2 బి.డా.తో, రాగి రంగంలో 1 బి.డా. పెట్టుబడి పెట్టాలనుకుంటోంది.
  • ఆరోగ్య సంరక్షణ రంగంలో (బీమా, ఆసుపత్రులు, డయాగ్నొస్టిక్‌, ఫార్మా) 7-10 బి.డాలర్ల పెట్టుబడులు పెట్టాలనుకుంటోంది.
  • 2015లో గ్రూప్‌ మార్కెట్‌ విలువ 16 బి.డా. కాగా, 2022 నాటికి 260 బి.డాలర్లకు చేరింది. ఏడేళ్లలోనే 16 రెట్లకు పైగా పెరిగింది. లక్ష కోట్ల డాలర్ల విలువ సాధించి, ప్రపంచ స్థాయి అగ్ర సంస్థల సరసన చేరాలనే లక్ష్యంతో అదానీ గ్రూప్‌ ముందుకు సాగుతోంది.
  • ఇదీ చదవండి:
  • మారుతీ సుజుకీ ఓనర్స్​కు అలర్ట్​ 9 వేల కార్లు రీకాల్​
  • కొత్త వాహనానికి బీమా కావాలా? అయితే ఇవి తప్పనిసరి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.