దేశీయ స్టాక్మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. బ్యాంకింగ్, ఆటో, ఇన్ఫ్రా రంగాలు రాణించడం, ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల పవనాలు వీయడమే ఇందుకు కారణం. మరోవైపు రుణ రహిత కంపెనీల జాబితాలోకి చేరిన రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు భారీగా లాభపడ్డాయి.
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 523 పాయింట్లు లాభపడి 34 వేల 731 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 152 పాయింట్లు వృద్ధిచెంది 10 వేల 244 వద్ద స్థిరపడింది.
లాభనష్టాల్లో
రిలయన్స్ ఇండస్ట్రీస్, బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంకు, మారుతి సుజుకీ, ఎస్బీఐ, ఏషియన్ పెయింట్స్ రాణించాయి.
ఇండస్ఇండ్ బ్యాంకు, ఐటీసీ, ఎం అండ్ ఎం, ఇన్ఫోసిస్, వేదాంత, హెచ్సీఎల్ టెక్ నష్టపోయాయి.