ETV Bharat / business

Stock Market Live: ఆసాంతం ఊగిసలాట- ఫ్లాట్​గా ముగిసిన సూచీలు

Stock Market Live Updates
Stock Market Live Updates
author img

By

Published : Dec 30, 2021, 9:34 AM IST

Updated : Dec 30, 2021, 3:43 PM IST

15:41 December 30

ఒడుదొడుకుల ట్రేడింగ్​లో స్టాక్ మార్కెట్లు ఫ్లాట్​గా ముగిశాయి. సెన్సెక్స్ 12 పాయింట్లు తగ్గి.. 57,794 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజీ- నిఫ్టీ 10 పాయింట్ల అతిస్వల్ప నష్టంతో.. 17,204 వద్ద ఫ్లాట్​గా ముగిసింది.

12:38 December 30

సూచీల ఊగిసలాట..

స్టాక్​ మార్కెట్లు ఒడుదొడుకులకు లోనవుతున్నాయి. ఫలితంగా దేశీయ సూచీలు స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్నాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్​ 100 పాయింట్లకుపైగా పుంజుకుని.. 57,940 వద్ద కదలాడుతోంది. మరో సూచీ నిఫ్టీ 28 పాయింట్ల లాభంతో 17,242 వద్ద ట్రేడవుతోంది.

ఐటీ షేర్లు రాణిస్తుండగా.. ఆటో, లోహా ప్రభుత్వ రంగ బ్యాంకుల అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.

దేశంలో కొవిడ్​, ఒమిక్రాన్​ కేసుల పెరుగుదల నేపథ్యంలో మదుపరులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. దీనికితోడు అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాలు పెట్టుబడిదారుల సెంటిమెంట్​ను దెబ్బతీస్తున్నాయి.

10:32 December 30

స్టాక్​ మార్కెట్లు లాభాల బాటపట్టాయి. ఐటీ, ఫార్మా షేర్లు సూచీలకు దన్నుగా నిలుస్తున్నాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్​ 150 పాయింట్లకుపైగా వృద్ధి చెంది.. 57,977 వద్ద కదలాడుతోంది. మరో సూచీ నిఫ్టీ 40 పాయింట్ల లాభంతో 17,253 వద్ద ట్రేడవుతోంది.

09:14 December 30

స్టాక్​ మార్కెట్​ లైవ్​ అప్​డేట్​

దేశీయ స్టాక్​ మార్కెట్లు​ గురువారం సెషన్​ను ఫ్లాట్​గా ప్రారంభించాయి. అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాల నేపథ్యంలో సూచీలు ఒడుదొడుకుల్లో ట్రేడవుతున్నాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్ 32 పాయింట్ల లాభంతో.. 57,839 వద్ద కదలాడుతోంది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ 5 పాయింట్లు వృద్ధి చెంది.. 17,218 వద్ద కొనసాగుతోంది.

  • విప్రో, టెక్​మహీంద్రా, టాటాస్టీల్​, భారతీఎయిర్​టెల్​, హెచ్​సీఎల్​టెక్​ షేర్లు ప్రధానంగా లాభాల్లో ట్రేడవుతున్నాయి.
  • ​బజాజ్​ఫిన్​సెర్వ్​, సన్​ఫార్మా, ఎన్​టీపీసీ, హెచ్​డీఎఫ్​సీ, ఐసీఐసీఐబ్యాంకు, కొటక్​బ్యాంకు షేర్లు ఎక్కువగా నష్టాల్లో కొనసాగుతున్నాయి.

Last Updated : Dec 30, 2021, 3:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.