ఈ వారం స్టాక్ మార్కెట్లకు(Stock markets) అంతర్జాతీయ పరిణామాలు, త్రైమాసిక ఫలితాలు, ఆర్థిక గణాంకాలు దిశా నిర్దేశం చేయనున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ వారంలో అమెరికా, చైనా ద్రవ్యోల్బణ రేటులను ప్రకటించనున్నాయి. ఇవి కూడా మార్కెట్లకు(Markets outlook) కీలకం కానున్నాయి.
"విదేశీ సంస్థాగత మదుపర్ల(ఎఫ్ఐఐఎస్) ప్రవర్తనతో పాటు అమెరికా, చైనాలోని ద్రవ్యోల్బణ రేట్లు ఈ వారం మార్కెట్ల కదలికలను కొంత మేర ప్రభావితం చేస్తాయి. అంతర్జాతీయ పరిణామాలతో సూచీలు సానుకూలంగా ప్రారంభం కావచ్చు. అయితే పలు కంపెనీ షేర్లు విలువ జీవిత కాల గరిష్ఠానికి చేరిన నేపథ్యంలో.. అమ్మకాల ఒత్తిడి ఉండే అవకాశం ఉంది."
- సంతోష్ మీనా, స్వస్తిక ఇన్వెస్ట్‌మార్ట్ హెడ్(పరిశోధన)
నవంబరు 10న అమెరికా, చైనా ద్రవ్యోల్బణ రేట్లను ప్రకటించనున్నాయి. ఇవి స్టాక్ మార్కెట్లపై అత్యంత ప్రభావం చూపే అవకాశముంది. వీటితో పాటు వెల్లడి కానున్న పారిశ్రామిక ఉత్పత్తి సూచిక(ఐఐపీ) గణాంకాలను మార్కెట్లపై ప్రభావం చూపవచ్చు.
ముత్తూట్ ఫైనాన్స్, బ్రిటానియా, మహీంద్రా అండ్ మహీంద్రా(ఎం అండ్ ఎం), బీహెచ్ఈఎల్, ఓఎన్జీసీ వంటి కంపెనీల క్యూ ఫలితాలు దేశీయ సూచీల కదలికలను కొంత ప్రభావితం చేయవచ్చు.
ఇదీ చూడండి: 'టెస్లా స్టాక్ అమ్మాలనుకుంటున్నా!- మీరేమంటారు?'