క్యూ1 ఫలితాలను పలు కంపెనీలు ఈ వారంలో ప్రకటించనున్నాయి. వీటి ఆధారంగా స్టాక్ మార్కెట్ కదలికలు ఉండనున్నాయి. అదే సమయంలో ఈ వారం విడుదల కానున్న పరిశ్రమల ఉత్పత్తి, ద్రవ్యోల్బణం గణాంకాలతో పాటు అంతర్జాతీయ పరిణామాలు ప్రధానంగా సూచీలను ప్రభావితం చేయనున్నాయి.
"ఈ వారం అందరి దృష్టి కీలకమైన పరిశ్రమల ఉత్పత్తి, కంపెనీల త్రైమాసిక ఫలితాలపైనే ఉంటుంది. మార్కెట్లో జోరు కొనసాగుతున్నప్పటికీ.. ఆర్థిక, ద్రవ్యోల్బణం గణాంకాలపై మదుపరులు దృష్టి సారించే వీలుంది."
- నిరాలి షా, సామ్కో సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ హెడ్
విదేశీ పెట్టుబడులు, రూపాయి, ముడిచమరు ధరలు కూడా మార్కెట్లకు కీలకంగా మారనున్నాయంటున్నారు నిపుణులు.
"ఈ వారం కీలకమైన ఆర్థిక గణాంకాలు, పరిశ్రమల ఉత్పత్తి, ద్రవ్యోల్బణం లెక్కలు రానున్నాయి. ఇవే సూచీలను నడిపిస్తాయి."
-వినోద్ నాయర్, జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్
ఎంఆర్ఎఫ్, అమ్టెక్ ఆటో, జిందాల్ స్టీల్, జిందాల్ పవర్ లిమిటెడ్, లుపిన్, ఐచర్ మోటార్స్, టాటా స్టీల్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, ఎన్బీసీసీ, ఓఎన్జీసీ ఇతర సంస్థలు ఈ వారంలో త్రైమాసిక ఫలితాలు ప్రకటించనున్నాయి.
"రుతుపవనాల పురోగతి, క్యూ1 ఫలితాలు, కరోనా వార్తలపై మదుపరులు ఈ వారం దృష్టి సారించే అవకాశం ఉంది."
-బినోద్ మోదీ, రిలయన్స్ సెక్యూరిటీస్
ఇదీ చూడండి: పెట్టుబడులు పెట్టే ముందు ఈ 5 విషయాలు మరవొద్దు..