అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం ప్రకంపనలకు తోడు, అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూలతలతో దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టపోయాయి.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ- సెన్సెక్స్ 159 పాయింట్ల నష్టంతో 36వేల 386కు చేరుకుంది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ- నిఫ్టీ 61 పాయింట్లు కోల్పోయి 10వేల 882 వద్ద ట్రేడవుతోంది.
లాభాలు- నష్టాలు...
ఆటో, బ్యాంకింగ్, ఫార్మా రంగాలు నష్టాల బాట పట్టాయి. వేదాంత, హీరో మోటోకార్ప్, కోల్ ఇండియా, యస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, మారుతీ సుజుకి, బజాజ్ ఆటో నష్టపోయిన సంస్థల జాబితాలో ఉన్నాయి.
టాటా స్టీల్, కొటక్ బ్యాంక్, ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లాభాల్లో కొనసాగుతున్నాయి.
బలపడిన రూపాయి...
వరుసగా ఐదోరోజు రూపాయి విలువ బలపడింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల తగ్గుదల ఇందుకు కారణమైంది. డాలర్‌తో పోలిస్తే 9 పైసలు పెరిగింది. ప్రస్తుతం మారకం విలువ 71.22 వద్ద కొనసాగుతోంది.