ETV Bharat / business

'క్రమంగా గాడిలో పడుతున్న ఆర్థిక వ్యవస్థ' - ఐపీఓల గురించి ఆర్​బీఐ

తయారీ రంగ కార్యకలాపాలు పెరగుతుండడం వల్ల ఆర్థిక వ్యవస్థ క్రమంగా గాడిలో పడుతోందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఓ వ్యాసంలో తెలిపింది. కరోనా ఆంక్షలు సడలించాక.. గిరాకీ పెరిగిందని, సరఫరా పరిస్థితులు మెరుగుపడుతున్నాయని చెప్పింది.

Economy
ఆర్థిక వ్యవస్థ
author img

By

Published : Aug 18, 2021, 5:56 AM IST

Updated : Aug 18, 2021, 6:48 AM IST

తయారీ రంగ కార్యకలాపాలు నెమ్మదిగా పుంజుకోవడం వల్ల ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతోందని, సేవల రంగమూ మెరుగైందని, నగదు లభ్యత పరిస్థితులు సౌకర్యవంతంగా ఉన్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) తాజా వ్యాసం 'స్టేట్ ఆఫ్ ఎకానమీ'లో పేర్కొంది. కరోనా వైరస్ ఉద్ధృతిని నియంత్రించేదుకు విధించిన ఆంక్షల సడలింపుతో గిరాకీ పెరిగిందని, సరఫరా పరిస్థితులు మెరుగుపడుతున్నాయని తెలిపింది.

దేశంలో రుతుపవనాలు సాధారణంగా ఉన్నందున, వ్యవసాయ కార్యకలాపాలు ఊపందుకున్నట్లు ఆర్‌బీఐ వివరించింది. ఆంక్షలు సడలించాక.. ప్రజల రాకపోకలు కొవిడ్ రెండో దశ మునుపటి స్థాయి (2021 ఫిబ్రవరి)కి చేరాయని తెలిపింది. ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ మైఖేల్ పాత్ర నేతృత్వంలోని బృందం ఈ వ్యాసాన్ని రచించింది.

ఐపీఓల నామ సంవత్సరం

ఈ ఏడాది ఐపీఓల నామ సంవత్సరంగా మారే అవకాశం ఉందని, దేశీయ యూనికార్న్ (సుమారు రూ. 7500 కోట్ల విలువైన సంస్థ)ల పబ్లిక్ ఇష్యూలు స్టాక్ మార్కెట్లలో దుమ్ము రేపుతున్నాయని, అంతర్జాతీయ పెట్టుబడిదార్లు ఆసక్తి చూపుతున్నారని ఆర్‌బీఐ వ్యాసం తెలిపింది. కొన్ని నెలల్లో వరుసగా ఐపీఓలు విజయవంతం కావడం ద్వారా భారత టెక్నాలజీపై బుల్లిష్ వైఖరి చూపుతున్నట్లు వెల్లడించింది. జొమాటో ఐపీఓకు 38 రెట్ల స్పందన రావడాన్ని ఆర్ బీఐ వ్యాసం ఉటంకించింది.

ఇదీ చూడండి: వాట్సాప్​ పేమెంట్స్ ఇక​ మరింత ఆకర్షణీయం!

ఇదీ చూడండి: టీసీఎస్​ రికార్డ్... రూ.13 లక్షల కోట్లపైకి ఎం-క్యాప్​

Last Updated : Aug 18, 2021, 6:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.