ETV Bharat / business

కరోనా దెబ్బకు ఆర్థిక వ్యవస్థలు కుదేలు - Corona effect of Barrel rates

కరోనా దెబ్బకు ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు ఇప్పటికే చాలావరకు కుదేలయ్యాయి. ఇప్పటికిప్పుడు ప్రపంచం నుంచి వైరస్​ మటుమాయమైనా- అది సృష్టించిన విధ్వంసం కనీసం మరో ఏడాదిపాటు కొనసాగుతుంది. కరోనా ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా విత్త మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. ఫలితంగా ముడి చమురు ధరలు పాతాళానికి చేరాయి. భారత్‌లోనూ ఆర్థిక సూచీలు నేల చూపులు చూస్తున్నాయి.

Economies and Collapsible Countries that Crowned the Corona
కరోనా దెబ్బకు ఆర్థిక వ్యవస్థలు కకావికలం
author img

By

Published : Mar 21, 2020, 7:19 AM IST

ముడి చమురు బ్యారెల్‌ ధర కనీవినీ ఎరుగని స్థాయికి దిగజారిపోయింది. న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్స్‌ఛేంజీలో తాజాగా బ్యారెల్‌ ధర 23 డాలర్లు పలికింది. 1973 జులైలో ముడి చమురు బ్యారెల్‌ 20 డాలర్లకు పడిపోయింది. 1946, 1998లలో స్వల్పకాలంపాటు బ్యారెల్‌ రేటు 17 డాలర్లుగా ఉంది. కరోనా ప్రభంజనంతో ప్రపంచవ్యాప్తంగా విత్త మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. ఫలితంగా ముడి చమురు ధరలు పాతాళానికి చేరాయి. భారత్‌లోనూ ఆర్థిక సూచీలు నేల చూపులు చూస్తున్నాయి. ముప్ఫై రోజుల కాలావధిలో సెన్సెక్స్‌ మూడింట ఒకవంతు పతనమైంది. కొవిడ్‌-19 దెబ్బకు ఆర్థిక వ్యవస్థలు కుదేలవుతున్నాయి. ఈ పరిస్థితి ఎన్నాళ్లు ఉంటుంది? సంక్షోభం సద్దుమణిగి దేశ ఆర్థికం ఎన్నటికి గాడినపడుతుంది అన్నవి ఇప్పుడు అందరినీ వేధిస్తున్న ప్రశ్నలు.

ఇప్పటికిప్పుడు కరోనా మటుమాయమైనా..

చైనాలో కరోనా పాజిటివ్‌ కేసులు తగ్గుముఖం పట్టాయి. వైరస్‌ బారినపడి సంభవించే మరణాలను ఆ దేశం దాదాపుగా నియంత్రించగలిగింది. కాబట్టి, మన దేశంలోనూ ఈ మహమ్మారిని కట్టడి చేయడం సాధ్యమేనని కొందరు ఆశల తోరణాలు కడుతున్నారు. సానుకూల దృక్పథంతో ముందడుగు వేయడాన్ని ఎవరూ తప్పుపట్టరు. కానీ, క్షేత్రస్థాయి పరిస్థితులు ఆశించినంత అనుకూలంగా లేవు. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను కరోనా ఇప్పటికే చాలావరకు భ్రష్టుపట్టించింది. ఇప్పటికిప్పుడు ప్రపంచంనుంచి కరోనా మటుమాయమైనా- అది సృష్టించిన విధ్వంస ప్రభావం కనీసం మరో ఏడాదిపాటు కొనసాగుతుంది. అవసరమైనప్పుడే బయటకు రావాలని, సమూహాల్లో ఉండరాదని ప్రభుత్వాలు పదేపదే చేస్తున్న ప్రచారం ప్రజాబాహుళ్యాన్ని కదిలిస్తోంది. దీనివల్ల వైరస్‌ విస్తరణ వేగాన్ని కొంతవరకు కట్టడి చేయవచ్చు. కానీ, టీకా అందుబాటులోకి వచ్చినప్పుడే సమస్యకు శాశ్వత పరిష్కారం సాధ్యం. ఇందుకు మరో రెండేళ్లు పట్టవచ్చు. ప్రపంచవ్యాప్తంగా సాధారణ పరిస్థితులు నెలకొని వ్యాపార కార్యకలాపాలు, జనసంచారం మొదలయ్యాక- ఉన్నట్లుండి వైరస్‌ మరోసారి కోరసాచినా ఆశ్చర్యం లేదు.

ఒక్కరిపైనై ఆధారపడటం వల్లే..

ఇకమీదట వ్యాపార, వాణిజ్యాలకు సంబంధించి భారత్‌ తన వ్యూహాలను సమీక్షించుకోవాల్సి రావచ్చు. ఇటలీలో ఫ్యాషన్‌ పరిశ్రమ పూర్తిగా చైనాపై మరీ ముఖ్యంగా ఆ దేశంలోని వుహాన్‌ నగరంపై ఆధారపడి మనుగడ సాగిస్తోంది. ఒక్కరిపైనే ఆధారపడటం ఫ్రాన్స్‌కు అతిపెద్ద ప్రతికూలాంశం. బంగ్లాదేశ్‌ తనకు అవసరమైన ముడివనరులను చైనానుంచి భారీగా దిగుమతి చేసుకుని- అమెరికా, పశ్చిమ ఐరోపా దేశాలకు ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. ఇకమీదటా ఇదే విధానాన్ని కొనసాగించడం ఆ దేశానికి సాధ్యమా అన్నది చర్చనీయాంశం. ముడి చమురు ధరలు తగ్గినా ప్రయోజనంలేని పరిస్థితులు నెలకొన్నాయి. అంతర్జాతీయ ప్రయాణాలు దాదాపుగా స్తంభించిపోవడంతో విమానయాన రంగం కుదేలైంది. కరోనా తాకిడి తగ్గిన తరవాతా కొన్ని దేశాలు ప్రయాణ, పర్యాటక ఆంక్షలు కొనసాగించవచ్చు. వ్యాపార పరిమాణం దారుణంగా తగ్గడంవల్ల- రెవిన్యూ లక్ష్యాల సాధనలో ప్రభుత్వంతోపాటు కార్పొరేట్‌ రంగమూ చతికిలపడటం ఖాయం.

నేలకొరిగిన స్టాక్​ మార్కెట్​ సూచీలు..

స్టాక్‌ మార్కెట్‌ సూచీలు నేలకు దిగడంతో పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాలపై ఆ ప్రభావం పడవచ్చు. అభివృద్ధి చెందిన దేశాల తరహాలోనే- కేంద్ర ప్రభుత్వమూ అత్యవసర నిధిని సిద్ధం చేయక తప్పదు. ఈ ఆర్థిక సంవత్సరానికిగాను రూపొందించుకున్న బడ్జెట్లో చేసుకున్న కేటాయింపులు, చెప్పుకొన్న లక్ష్యాలు గాడితప్పే అవకాశాలు కొట్టిపారేయలేనివి. చమురుపై పన్నులు పెంచి విపత్కర పరిస్థితులనుంచి బయటపడేందుకు ప్రభుత్వం ప్రయత్నించవచ్చు. అయితే మితిమీరి పన్నులు పెంచినా అది దేశ ఆర్థికానికి శరాఘాతమవుతుంది. దివాళా స్మృతి (ఐబీసీ)వల్ల నగదు నిల్వల పరంగా బ్యాంకులు కొంతవరకైనా కోలుకున్నాయి. గడచిన కొన్నేళ్లలో కార్పొరేట్‌ రంగం పనితీరునూ ‘ఐబీసీ’ గుణాత్మకంగా మార్చింది. కరోనా నేపథ్యంలో మొండి బాకీల విషయంలో బ్యాంకులు మునుపటంత దూకుడుగా వ్యవహరించగలవా అన్న సందేహం ఉంది. ఆయా సంస్థల స్థిరాస్తులను వేలానికి పెడితే కొనేందుకు ఎంతమంది ఉత్సాహంగా ముందుకు వస్తారన్నది ప్రశ్న.

కార్పొరేట్​ రంగంలోనూ..

భారత్‌లో కార్పొరేట్‌ రంగానికి చెందిన ఆస్తుల కొనుగోలుకు గతంలో మాదిరిగా విదేశీ పెట్టుబడిదారులు మొగ్గుచూపుతారా అన్నదీ తేలాల్సి ఉంది. ఎవరూ కొనుగోళ్లకు చొరవ చూపకపోతే కార్పొరేట్లు, బ్యాంకుల బ్యాలెన్స్‌ షీట్లపై ఆ ప్రభావం పడుతుంది. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ప్రజాకర్షక విధానాలను నెత్తికెత్తుకొని- ఉత్పత్తి వ్యయం కంటే తక్కువ రేట్లకే విద్యుత్తును పంపిణీ చేస్తున్నాయి. ‘డిస్కమ్‌’లు దేశవ్యాప్తంగా అప్పుల్లో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో ఈ తరహా పథకాలు కొనసాగితే ఆ ప్రభావం మళ్ళీ బ్యాంకులపైనే పడుతుంది. కరోనా నేపథ్యంలో తలెత్తిన సంక్షోభాన్ని అవకాశంగా మలచుకుని ప్రభుత్వాలు అలవిమాలిన ప్రజాకర్షక పథకాలకు ముగింపు పలికే దిశగా అడుగులు కదపాలి. చమురు ధరలు కోసుకుపోవడంతో పశ్చిమాసియాలో కొత్త సంక్షోభం రాజుకొంది. పూర్తిగా చమురు వాణిజ్యంపైనే ఆధారపడిన పశ్చిమాసియా, ఆఫ్రికా దేశాల ఆర్థిక వ్యవస్థలు దీనివల్ల గందరగోళంలో పడతాయి. గల్ఫ్‌ దేశాల్లో భారత్‌కు చెందిన 85 లక్షలమంది కార్మికులు పనిచేస్తున్నారు. వీరంతా దాదాపుగా ప్రత్యేక నైపుణ్యాలేమీ లేని పనివారు. పశ్చిమాసియాలో నెలకొనే ఏ సంక్షోభమైనా ఈ కార్మికుల జీవనాన్ని కకావికలం చేయడంతోపాటు- భారత ఆర్థిక వ్యవస్థనూ ఒడుదొడుకుల పాలు చేస్తుందనడంలో మరో మాట లేదు.

- ప్రతిమ్‌ రంజన్‌ బోస్‌, రచయిత- ఆర్థిక రంగ నిపుణులు

ఇదీ చదవండి: ముడిచమురు ధరలు క్షీణించినా-పెట్రోల్​, డీజిల్​ తగ్గలేదు ఎందుకు?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.