జన్ ధన్ బ్యాంక్ ఖాతాలున్న మహిళలకు రెండో విడత రూ.500 నగదు బదిలీ సోమవారం ప్రారంభం కానుంది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటన చేసింది.
కరోనా కారణంగా విధించిన లాక్డౌన్తో ఎవరూ ఇబ్బంది పడకుండా నెలకు రూ.500 చొప్పున ఆర్థిక సాయాన్ని (మూడు నెలల వరకు) జన్ ధన్ ఖాతాల్లో జమ చేయనున్నట్లు మార్చిలో కేంద్రం ప్రకటించింది. 'ప్రధాన్ మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన' భాగంలో ఈ సాయం అందిస్తోంది.
మే నెల చెల్లింపులకు సంబధించిన మొత్తాన్ని ఇప్పటికే బ్యాంకులకు పంపినట్లు ఆర్థిక శాఖ తెలిపింది.
లబ్ధిదారులందరికీ ఖాతా నంబర్లో చివరి అంకె ఆధారంగా దశలవారీగా రెండో విడత నగదు జమ చేయనున్నట్లు వెల్లడించింది.
రెండో విడత చెల్లింపులు ఇలా..
ఖాతా నంబరు చివర్లో 0,1 అంకెలు ఉంటే మే 4న..., 2,3 (మే 5న)..., 4,5 (మే 6న)..., 6,7 (మే 8న)..., 8,9 (మే 11)న చెల్లింపులు జరపనున్నట్లు కేంద్రం వెల్లడించింది.
ఇదీ చూడండి:మస్క్ ట్వీట్ తెచ్చిన తంటా- టెస్లా షేర్లు 10% డౌన్