కరోనా మహమ్మారి వల్ల.. దేశంలో డిజిటల్ ఆర్థిక లావాదేవీలు భారీగా పెరిగాయి. రియల్‌టైమ్ పేమెంట్స్ పరంగా రోజుకు 4.1 కోట్ల లావాదేవీలతో భారత్ అగ్రస్థానంలో నిలిచినట్లు ఓ అంతర్జాతీయ సర్వేలో తేలింది. గత ఏడాదితో పోలిస్తే రియల్ టైమ్ లావాదేవీలు రెండింతలకన్నా అధికంగా పెరిగినట్లు వెల్లడైంది. భారత్‌తో పాటు మరో ఆరు దేశాల్లోనూ రెట్టింపునకు మించి రియల్ టైమ్ లావాదేవీలు నమోదయ్యాయని.. అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ 'ఎఫ్ఐఎస్' నివేదిక వివరించింది.
నివేదిక ముఖ్యాంశాలు..
- రియల్‌టైమ్ లావాదేవీల్లో వృద్ధి రేటు పరంగా చూస్తే మాత్రం బెహ్రయిన్ (657 శాతం), ఘనా (488 శాతం), ఫిలిప్పీన్స్ (309 శాతం), ఆస్ట్రేలియా (214 శాతం), పోలాండ్ (208 శాతం) అగ్రస్థానంలో ఉన్నాయి.
- రియల్‌టైమ్ పేమెంట్లలో భారత్ 213 శాతం వృద్ధి రేటును సాధించింది.
- దక్షిణ కొరియాలో ఏడాదికి తలసరి లావాదేవీల సంఖ్య 75గా ఉంది.
- చైనాలో 3.8 కోట్లు, దక్షిణ కొరియాలో 1.2 కోట్ల రియల్‌టైమ్ లావాదేవీలు(రోజుకు) జరుగుతున్నాయి.
ఇదీ చూడండి:కాపీ రైట్ కేసులో సుప్రీం కోర్టుకు గూగుల్, ఒరాకిల్