ETV Bharat / business

వాట్సాప్​లో కొత్త ఫీచర్​- ఎన్ని ఫోన్లయినా ఒకే అకౌంట్​! - వాట్సాప్ మల్టీ డివైజ్ ఫీచర్​ అంటే ఏమిటి

వాట్సాప్​ మరో కొత్త ఫీచర్ అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఎక్కువ ఫోన్లు వాడేవారికి అనుగుణంగా.. మల్టీ డివైజ్​ సపోర్ట్ ఫీచర్​ను పరీక్షిస్తోంది. ఈ ఫీచర్​ పూర్తి వివరాలు మీ కోసం.

multi dives support in whatsapp
వాట్సాప్​లో మల్టీ డివైజ్ సపోర్ట్
author img

By

Published : May 6, 2020, 1:08 PM IST

వాట్సాప్‌.. స్మార్ట్‌ఫోన్‌ వాడే ప్రతి ఒక్కరి జీవితంలో అంతర్భాగం అయిపోయిన యాప్‌. కేవలం వ్యక్తిగత జీవితంలోనే కాదు.. వృత్తి జీవితంలోనూ భాగమైపోయింది. అందుకే ఎప్పటికప్పుడు వాట్సాప్‌ తన ఫీచర్స్‌ను అప్‌డేట్‌చేస్తూ వస్తోంది. ఇప్పటికీ ఈ యాప్‌ విషయంలో ఒక అసంతృప్తి ఉంది. అదే... మల్టీ డివైజ్‌ సపోర్ట్‌ లేకపోవడం. గతేడాదే ఈ ఫీచర్​ను‌ వాట్సాప్‌ పరీక్షించినప్పటికీ ఎందుకో వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురాలేదు. ఇప్పుడు మళ్లీ ఆ సదుపాయాన్ని వాట్సాప్‌ పరీక్షిస్తోంది. ప్రస్తుతం 2.20.143 ఆండ్రాయిడ్‌ బీటా వెర్షన్‌లో ఈ ఫీచర్‌ కనిపించిదట.

వాట్సాప్‌ ఒక డివైజ్‌లో వాడుతున్నప్పుడు ఇంకో డివైజ్‌లో వాడలేం. ఒకవేళ అందులో వాడాలంటే ఇంకో దానిలో వాట్సాప్‌ పనిచేయదు. రెండు చోట్లా వాడాలనుకునేవారు ఈ విషయంలో నిరాశకు గురవుతున్నారు. ప్రస్తుతం ఏక కాలంలో ఒకే అకౌంట్‌ వాడాలంటే ఉన్న ఏకైక ఆప్షన్‌ వాట్సాప్‌ వెబ్‌ మాత్రమే.

మల్టీ డివైజ్‌ ఫీచర్‌ త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఇదే అందుబాటులోకి వస్తే ఒక ఫోన్‌, టాబ్లెట్‌ లేదా ఒకటి కంటే ఎక్కువ స్మార్ట్‌ఫోన్లు కలిగి ఉన్నవారికి ఇది ఉపయోగపడుతుంది. ఈ ఫీచర్‌తో ఒకేసారి రెండు వేర్వురు ఫోన్లలో వాట్సాప్‌ను వినియోగించుకోవచ్చు.

ఇదీ చూడండి:కరోనాతో ప్యాకేజ్డ్ ఉత్పత్తులకు మరింత గిరాకీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.