కరోనా మహమ్మారి సృష్టించిన సంక్షోభ ప్రభావంతో దిగ్గజ సంస్థలూ కుదేలవుతున్నాయి. ఈ నేపథ్యంలో చాలా సంస్థలు ఉద్యోగాల కోత వంటి కఠినమైన నిర్ణయాలతో ఖర్చులు తగ్గించుకునే పనిలో పడ్డాయి. ఈ జాబితాలో దిగ్గజ వాహన సంస్థ టాటా మోటార్స్‌కు చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ జాగ్వార్, ల్యాండ్‌రోవర్ (జేఎల్ఆర్) చేరింది
లండన్ కేంద్రంగా పని చేస్తున్న జేఎల్ఆర్ దాదాపు 1,000 ఉద్యోగాల కోత విధించాలని చూస్తోంది. కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో తమ విక్రయాలు 30.9 శాతం పడిపోయినట్లు ప్రకటించింది. ఈ కారణంగానే ఉద్యోగాల కోత ద్వారా ఖర్చులు తగ్గించుకోవాలని భావిస్తోంది.
ముఖ్యంగా బ్రిటన్‌లో ఉన్న తమ ప్లాంట్లలోని కాంట్రాక్ట్ ఏజెన్సీ ఉద్యోగులను తగ్గించుకోవాలని చూస్తున్నట్లు జేఎల్ఆర్ తెలిపింది. జులై చివరి నుంచి ఈ ఏడాది చివరి వరకు ఉద్యోగాల కోత ప్రక్రియ కొనసాగనున్నట్లు వెల్లడించింది.