ETV Bharat / business

డిసెంబర్​ నాటికి 'రియల్​మీ'లో 7,500 నియామకాలు

ఈ ఏడాది చివరి నాటికి భారత్​లో కొత్తగా 7,500 నియామకాలు చేపట్టనున్నట్లు స్మార్ట్​ఫోన్ల తయారీ సంస్థ రియల్​మీ ప్రకటించింది. ఇంటర్​నెట్​ ఆఫ్​ థింగ్స్​ ఉపకరణాల తయారీ, విక్రయ బృందాల విస్తరణ కోసం ఈ నియామకాలు చేపట్టనున్నట్లు వెల్లడించింది.

author img

By

Published : Jun 24, 2020, 12:24 PM IST

jobs  in Realme
రియల్​మీలో నియామకాలు

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్​ఫోన్ల తయారీ సంస్థ రియల్​మీ భారత్​లో ఉద్యోగుల సంఖ్య పెంచుకోవాలని చూస్తోంది. ప్రస్తుతం తాము స్మార్ట్‌ టూత్‌బ్రష్‌లు, వ్యాక్యూమ్​ క్లీనర్లు, స్మార్ట్‌ లాక్స్‌ వంటి ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ రూపకల్పనపై దృష్టి సారించినట్లు సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. వీటి తయారీతో పాటు విక్రయ కార్యకలాపాల విస్తరణ కోసం 7,500 మందిని ఈ ఏడాది ఆఖరులోపు నియమించుకుంటామని సంస్థ సీఈఓ మాధవ్​ సేథ్​ తెలిపారు.

రియల్​మీకి ప్రస్తుతం దిల్లీ కార్యాలయంలో 7,500 మంది ఉద్యోగులుండగా.. డిసెంబర్ నాటికి ఈ సంఖ్య 10,000కు పెంచుకోనున్నట్లు మాధవ్‌ సేథ్‌ చెప్పారు. వీరితో పాటు మరో 5,000 మందితో టైర్​ 4, టైర్​ 5 పట్టణాలకు విక్రయ బృందాలను విస్తరిస్తామని వెల్లడించారు.

స్మార్ట్‌ టీవీ, స్మార్ట్‌ ఇయర్‌ఫోన్‌, స్మార్ట్‌ వాచ్‌, స్మార్ట్‌స్పీకర్లు, కార్‌లో వినియోగించుకునే ఛార్జర్లు, బ్యాక్‌ప్యాక్‌లు, స్మార్ట్‌హోం‌ పరికరాలు కూడా ఉత్పత్తి చేస్తామని రియల్​మీ తెలిపింది. అయితే స్మార్ట్​ఫోన్ల తయరీనే సంస్థ ప్రధాన వ్యాపారంగా ఉంటుందని స్పష్టం చేసింది.

ఇదీ చూడండి:పెట్రోల్​ను దాటేసిన డీజిల్.. నేటి ధరలు ఇవే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.