ETV Bharat / business

ఏప్రిల్, మే నెల జీతాలు చెల్లించలేం: స్పైస్​జెట్

author img

By

Published : Apr 29, 2020, 2:51 PM IST

లాక్​డౌన్ కారణంగా పైలట్లకు ఏప్రిల్​, మే నెలల జీతాలు చెల్లించలేమని ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్​జెట్ తెలిపింది. ప్రస్తుతం కార్గో విమానాలు నడిపిస్తున్న పైలట్లకు మాత్రం.. విమానాలు నడిపిన కాలానికి.. 'బ్లాక్ అవర్స్ ఫ్లోన్' ప్రాతిపదికన జీతాలు చెల్లిస్తామని స్పష్టం చేసింది.

salaries to spicejet pilots
సైస్​జెట్ పైలట్లకు జీతాలు ఇవ్వబోం

ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్​జెట్​ కీలక నిర్ణయం తీసుకుంది. లాక్​డౌన్​ నేపథ్యంలో విమాన సేవలు తాత్కాలికంగా నిలిచిపోయినందున ఏప్రిల్, మే నెలకు గానూ పైలట్లకు జీతాలు ఇవ్వలేమని తెలిపింది. అయితే కార్గో విమానాలు నడిపిస్తున్న పైలట్లకు మాత్రం వేతనాలు చెల్లిస్తామని స్పష్టం చేసింది. వారికి కూడా విమానాలు నడిపిన సమయం 'బ్లాక్ అవర్స్ ఫ్లోన్' ప్రాతిపదికన జీతాలు చెల్లించనున్నట్లు తెలిపింది.

ఈ మేరకు స్పైస్​జెట్ కార్యకలాపాల ముఖ్య అధికారి గురుచరన్​ అరోరా తమ పైలట్లకు ఈ-మెయిల్ ద్వారా సమచారమిచ్చారు.

ప్రస్తుతం తాము 5 కార్గో విమానాలు, ప్రయాణికుల క్యాబిన్‌లో సరకులను తీసుకువెళ్లే మరికొన్ని కార్గో ఆన్‌ సీట్ విమానాలను నడుపుతున్నట్లు తెలిపారు అరోరా. దేశవ్యాప్త లాక్​డౌన్ కారణంగా మార్చి 25 నుంచి అన్ని ప్యాసింజర్​ విమానాలు నేలకే పరిమితమైన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.

రానున్న రోజుల్లో 100 శాతం పైలట్ల వినియోగం..

అయితే రానున్న రోజుల్లో కార్గో, కార్గో ఆన్​సీట్ విమానాలను 50 శాతానికిపైగా పెంచుకోవాలని, పైలట్లను 100 శాతం వినియోగించుకోవాలని భావిస్తున్నట్లు.. మీడియా పంపిన ఒక ఈ మెయిల్​కు సమాధానంగా వెల్లడించింది.

ఇదీ చూడండి:ఆ దిగ్గజ సంస్థలో 12 వేల ఉద్యోగాలు కట్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.