ప్రపంచంలోనే టాప్ పారిశ్రామికవేత్తల మధ్య విభేధాలు నడుస్తున్నాయి. ప్రస్తుతం వారి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంది. వారెవరంటే ఈ కామర్స్ దిగ్గజం, అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ ఒకరు. టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ మరొకరు.
తాజగాా వీరిద్దరి మధ్య విభేధాలు బహిర్గతమయ్యాయి. జెఫ్ బెజోస్పై.. ఎలాన్ మస్క్ ట్విట్టర్ వేదికగా విమర్శలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఓ స్వీయ నియంత్రణ కార్ల కంపెనీని బెజోస్ కొనుగోలు చేయాలనుకోవడం ఈ వివాదానికి కారణమైంది.
అసలు విషయమిదే..!
టెస్లాలానే జూక్స్ అనే స్టార్టప్ కంపెనీ వాహనాల తయారీలో పలు ప్రయోగాలు చేస్తోంది. రోబోలు, పునరుత్పాదక విద్యుత్ సహా పలు సాంకేతికల ఆధారంగా నూతన ఆవిష్కరణలకు ప్రయత్నిస్తోందీ సంస్థ. అయితే ఇప్పుడు ఆ అంకుర సంస్థను 1 బిలియన్ డాలర్లతో.. జెఫ్ బెజోస్ కొనుగోలు చేయాలనుకుంటున్నట్లు వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో బెజోస్పై విమర్శనాత్మక ట్వీట్ చేశారు ఎలాన్ మస్క్.
"జెఫ్ బెజోస్ ఒక కాపీ [క్యాట్].." అని ట్వీట్ చేశారు. దానికి జూక్స్‌ను బెజోస్ కొనుగోలు చేయాలని భావిస్తున్నట్లు వచ్చిన ఓ కథనాన్ని ట్యాగ్ చేశారు. అయితే మస్క్ ట్వీట్‌పై జెఫ్‌బెజోస్ ఇంత వరకు స్పందించలేదు.
-
.@JeffBezos is a copy 🐈 haha https://t.co/plR7uupqBG
— Elon Musk (@elonmusk) June 26, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">.@JeffBezos is a copy 🐈 haha https://t.co/plR7uupqBG
— Elon Musk (@elonmusk) June 26, 2020.@JeffBezos is a copy 🐈 haha https://t.co/plR7uupqBG
— Elon Musk (@elonmusk) June 26, 2020
గతంలో కూడా అమెజాన్ గుత్తాధిపత్యానికి బ్రేకప్ చెప్పాల్సిన సమయం వచ్చింది అంటూ మస్క్ ట్వీట్ చేయడం చర్చనీయాంశమైంది.
-
Time to break up Amazon. Monopolies are wrong!
— Elon Musk (@elonmusk) June 4, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Time to break up Amazon. Monopolies are wrong!
— Elon Musk (@elonmusk) June 4, 2020Time to break up Amazon. Monopolies are wrong!
— Elon Musk (@elonmusk) June 4, 2020
జూక్స్తో టెస్లా వివాదం..
టెస్లా, జూక్స్ మధ్య గతంలో ఓ వివాదం ఉంది. తమ మాజీ ఉద్యోగులను నిబంధనలకు విరుద్ధంగా లాక్కుందనే ఆరోపణలతో.. జూక్స్పై దావా వేసింది టెస్లా. ఈ కేసులో జూక్స్ సంస్థ టెస్లాకు పెనాల్టీ కూడా చెల్లించింది.
ఇదీ చూడండి:'భారత్‌లో 'గూగుల్ పే'ను నిషేధించలేదు'