ETV Bharat / business

కరోనా కాలంలో మీ ఇంటి వద్దకే బ్యాంకింగ్ సేవలు

కరోనా నేపథ్యంలో బ్యాంకులు తమ సేవల్లో భారీ మార్పులు చేశాయి. ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇంటివద్దే బ్యాంకింగ్ సేవలు పొందడి అంటూ సరికొత్త సౌలభ్యాన్ని ఖాతాదారులకు కల్పిస్తున్నాయి. మరి ఈ సేవలు ఎలా వినియోగించుకోవాలి? వీటికి ఏమైనా ఛార్జీలు ఉంటాయా? బ్యాంకింగ్​కు సంబంధించి ఏ ఏ అవసరాలకు ఇంటి దగ్గరి నుంచే సేవలు పొందొచ్చు? ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

author img

By

Published : Sep 20, 2020, 7:40 AM IST

DOORSTEP BANKING CHARGES
డోర్​స్టెప్ బ్యాంకింగ్ సేవల ఛార్జీలు

ఇంటి నుంచే మరిన్ని బ్యాంకింగ్‌ సేవలు పొందేందుకు ఖాతాదారులకు ప్రభుత్వ రంగ బ్యాంకు (పీఎస్‌బీ)లు అవకాశం కల్పిస్తున్నాయి. కొవిడ్‌-19 నేపథ్యంలో, బ్యాంకు శాఖలకు వచ్చి, వరుసలలో ఉండేందుకు భయాందోళన చెందుతున్న వారికి ఇవి సౌలభ్యంగా ఉండనున్నాయి. ఇందుకోసం 'ఇంటివద్దే బ్యాంకింగ్‌ సేవలు పొందండి' అంటూ పీఎస్‌బీలు తమ ఖాతాదార్లకు ఇటీవల సంక్షిప్త సందేశాలు పంపుతున్నాయి కూడా. ఈ సేవలు ఉచితం మాత్రం కాదు. ప్రత్యేకంగా నమోదు చేసుకోవడంతో పాటు ప్రతి సేవకు రుసుము చెల్లించాల్సిందే.

ఇవి ఎలా పొందవచ్చంటే..

ఇప్పటికే దేశంలోని దిగ్గజ ప్రైవేటు రంగ బ్యాంకులు అందిస్తున్న సేవలను తామూ కల్పించడం ద్వారా, ఖాతాదార్లకు మెరుగైన సేవలు అందించవచ్చని 12 ప్రభుత్వరంగ బ్యాంకులు నిర్ణయించాయి. వీరంతా కలిపి, ఎంపిక చేసిన సంస్థ ప్రతినిధుల ద్వారా అందించే 'డోర్‌స్టెప్‌ బ్యాంకింగ్‌ సర్వీసెస్‌' (ఇంటి వద్దే సేవల)కు రుసుము ఉంటుంది.

స్టేట్‌బ్యాంక్‌ ఇండియాతో పాటు యూనియన్‌ బ్యాంక్‌, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, ఇండియన్‌ బ్యాంక్‌, కెనరా బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంక్‌, పంజాబ్‌ అండ్‌ సింధ్‌ బ్యాంక్‌, యూకో బ్యాంకులు కలిసి ఆత్యతి టెక్నాలజీస్‌ ప్రైవేటు లిమిటెడ్‌, ఇంటెగ్రా మైక్రో సిస్టమ్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌లను ఇందుకోసం ఎంపిక చేసుకున్నాయి. వీటికి టోల్‌ఫ్రీ నెంబర్లు, యాప్‌లుఉన్నాయి. మనం కోరుకునే సేవను ఈ ప్రైవేటు సంస్థల ప్రతినిధులు చేస్తారు. వ్యక్తులు సొంత ఖాతా పనులు మాత్రమే ఇలా నిర్వహించుకునే వీలుంటుంది.

మధ్యాహ్నం 3 గంటలలోపు..

మోసాలకు తావివ్వకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు బ్యాంకుల ప్రతినిధులు తెలిపారు. బ్యాంకులు పనిచేసే రోజు మధ్యాహ్నం 3 గంటలలోపు కనుక, ఏదైనా సేవ కోసం కాంట్రాక్టు సంస్థల యాప్‌, వెబ్‌సైట్‌లో నమోదు చేసుకుంటే, 3 గంటల వ్యవధిలో పూర్తి చేయాల్సి ఉంటుంది. సాయంత్రం 3 గంటల తరవాత నమోదు చేసుకుంటే, మరుసటిరోజు మధ్యాహ్నం ఒంటి గంట లోపు పూర్తవుతుంది.

ఛార్జీ రూ.75+ జీఎస్‌టీ

  • ఆర్థిక/ఆర్థికేతర సేవ దేనికైనా రూ.75(జీఎస్‌టీ అదనం) చెల్లించాల్సి ఉంటుంది. 18% జీఎస్‌టీకి రూ.13.50 అవుతుంది. అంటే ప్రతి సేవకు రూ.88.50 చెల్లించాల్సి వస్తుంది.
  • ప్రతినిధిని పంపాల్సిన అవసరం లేని, సమాచారం కోసం చేసే కాల్స్‌కు ఎటువంటి చార్జీ ఉండదు. నమోదు, వినియోగం ఇలా సంబంధిత సంస్థల యాప్‌లను గూగుల ప్లేస్టోర్‌ లేదా యాపిల్‌ ఐస్టోర్‌ నుంచి దిగుమతి చేసుకోవాలి.
  • బ్యాంకులో నమోదైన సిమ్‌ కలిగిన స్మార్ట్‌ఫోన్‌లోనే చేసుకోవాలి. ఓటీపీ వస్తుంది. ఓటీపీ నమోదు చేశాక, అంగీకారం తెలుపుతుంది. పేరు, ఇమెయిల్‌, పాస్‌వర్డ్‌, చిరునామా నమోదు చేయాలి.
  • ఈ యాప్‌లో సేవ నమోదు చేసుకునేందుకు, తమ బ్యాంకు పేరును ఎంచుకుని, బ్యాంక్‌ ఖాతా నెంబరులోని చివరి 6అంకెలు నమోదు చేయాలి. మళ్లీ ఓటీపీ వస్తుంది. ఇది నమోదు చేశాకే, బ్యాంక్‌ ఖాతా వివరాలు కనపడతాయి. అప్పుడు ఏ సేవ కావాలో నమోదు చేసుకోవాలి.
  • ఖాతాదారు చిరునామాకు 10 కిలోమీటర్ల పరిధిలోని బ్యాంకు శాఖల వివరాలు దర్శనమిస్తాయి.
  • కావాల్సిన శాఖ, ఏజెంటు ఏ సమయంలో రావాలో నమోదు చేసి, సేవారుసుము చెల్లించాలి. ఇవి ఖాతా నుంచి డెబిట్‌ అవుతాయి.
  • తదుపరి వచ్చే ఏజెంట్‌ వివరాలు, ఫొటోతో సహా నోటిఫికేషన్‌ వస్తుంది. ఏజెంటును నిర్థరించుకున్నాక, మన దగ్గర ఉండే సర్వీస్‌కోడ్‌ను నమోదు చేశాకే సేవ అందించే వీలవుతుంది. మన దగ్గర నుంచి తీసుకెళ్లే నగదు, పత్రాలను మనముందే సీల్‌ చేసి తీసుకెళ్తారు.
  • మనకు బ్యాంకు నుంచి వచ్చే పత్రాలు కూడా సీల్డ్‌ కవర్‌లోనే ఉంటాయన్నది మరువకూడదు.

ఇవీ సేవలు

  • ఖాతా నుంచి డబ్బు తెప్పించుకోవచ్చు, ఖాతాలో వేయొచ్ఛు
  • డిమాండ్‌ డ్రాఫ్టులు, పే ఆర్డర్ల వంటివీ అందుకోవచ్చు, బ్యాంకుకు పంపొచ్చు
  • చెక్‌లు బ్యాంకులో జమచేసేందుకు పంపొచ్ఛు. చెక్‌ బుక్‌ కోసం అభ్యర్థన ఇవ్వొచ్ఛు
  • బ్యాంక్‌ ఖాతా స్టేట్‌మెంట్‌ పొందొచ్ఛు కాలావధి డిపాజిట్‌ రసీదులు, 15జీ/హెచ్‌ ఫారాలు పంపొచ్ఛు
  • పింఛనర్లు లైఫ్‌ సర్టిఫికెట్‌ ఇవ్వొచ్ఛు. కేవైసీ ధ్రువీకరణలూ బ్యాంకుకు పంపొచ్ఛు

ఇలాంటి ఖాతాలకు చెల్లవు

  • జాయింట్‌ అకౌంట్‌లో ఒకరు ఉండి, మరొకరు లేకున్నా.
  • మైనర్‌ ఖాతాలు (గార్డియన్‌ పర్యవేక్షణలో పనిచేసేవి).
  • పవర్‌ఆఫ్‌ అటార్నీ ద్వారా నిర్వహించే ఖాతాలు.
  • నిర్వహణలో లేనివి, కేవైసీ పూర్తిచేయని ఖాతాలు.
  • ఎన్‌ఆర్‌ఐ/విదేశీ పౌరసత్వం ఉన్న వ్యక్తుల ఖాతాలు.
  • నిరక్షరాస్యుల ఖాతాలు.

సంస్థ: ఆత్యతి టెక్నాలజీస్‌

టోల్‌ఫ్రీ నెంబరు: 18001037188

యాప్‌ వెబ్‌ పోర్టల్‌: Doorstep Banking

సంస్థ: ఇంటెగ్రా మైక్రో సిస్టమ్స్‌

టోల్‌ఫ్రీ నెంబరు: 18001213721

యాప్‌ వెబ్‌ పోర్టల్‌: PSB Doorstep Banking

ఇదీ చూడండి:రూ.2వేల నోటుపై కేంద్రం మరోసారి క్లారిటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.