ETV Bharat / business

15 రోజుల ట్రయల్​ ఆఫర్​తో స్మార్ట్​ఫోన్​.. నచ్చితే కంటిన్యూ.. లేదంటే రిటర్న్! - flipkart love it or return it

ఖరీదైన స్మార్ట్​ఫోన్ ఆన్​లైన్​లో కొనాలంటే చాలా మంది వెనకడుగు వేస్తుంటారు. రిటర్న్ పాలసీ ఉన్నప్పటికీ.. ఏవో భయాలు ఉంటూనే ఉంటాయి. అందుకే ప్రీమియం స్మార్ట్​ఫోన్ల కోసం ప్రత్యేకంగా 'లవ్ ఇట్ ఆర్ రిటర్న్ ఇట్' ఫీచర్​ను (Flipkart Return Policy) తీసుకొచ్చింది ఫ్లిప్​కార్ట్. కొన్న స్మార్ట్​ఫోన్ నచ్చకపోతే.. 15రోజుల్లో తిరిగి ఇచ్చే ఆప్షన్​ను అందుబాటులోకి తెచ్చింది. పూర్తి రీఫండ్​ను బ్యాంకు ఖాతాల్లోకి జమ చేయనుంది.

FLIPKART LOVE IT OR RETURN IT
ఫ్లిప్​కార్ట్ స్మార్ట్​ఫోన్స్
author img

By

Published : Nov 7, 2021, 4:28 PM IST

ఆన్​లైన్ షాపింగ్ దిగ్గజం ఫ్లిప్​కార్ట్ సరికొత్త సదుపాయాన్ని యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది. ప్రీమియం స్మార్ట్​ఫోన్ల (Premium Smartphones in India) కోసం కొత్త రిటర్న్ పాలసీని (Flipkart Return Policy) ప్రవేశపెట్టింది. కొన్న స్మార్ట్​ఫోన్ నచ్చకపోతే.. పూర్తి రీఫండ్ చేసే విధానాన్ని తీసుకొచ్చింది. 'లవ్ ఇట్ ఆర్ రిటర్న్ ఇట్' పేరుతో తీసుకొచ్చిన ఈ ఫీచర్​ను ఉపయోగించుకోవాలంటే.. కొన్న స్మార్ట్​ఫోన్​ను 15 రోజుల్లోగా రిటర్న్ చేయాల్సి ఉంటుంది. ఈ ఫీచర్ కోసం శాంసంగ్​తో జట్టుకట్టింది ఫ్లిప్​కార్ట్. ప్రస్తుతానికి శాంసంగ్ గెలాక్సీ జడ్ ఫోల్డ్ 3, గెలాక్సీ జడ్ ఫ్లిప్ 3 ప్రీమియం స్మార్ట్​ఫోన్లకు మాత్రమే ఈ ఫీచర్ వర్తిస్తుంది.

కొన్న తర్వాత 15 రోజుల్లో స్మార్ట్​ఫోన్ నచ్చకపోతే.. ఫ్లిప్​కార్ట్ యాప్ ద్వారా రిటర్న్ రిక్వెస్ట్ పంపించాలి. ఫోన్ ఐఎంఈఐ నెంబర్​ను సమర్పించాలి. క్వాలిటీ చెక్ అనంతరం ఫోన్ పికప్ డేట్​ను ఎంచుకోవాలి. ఫోన్​ను పరీక్షించిన తర్వాత పూర్తి రీఫండ్​ను బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. బెంగళూరు, హైదరాబాద్, పుణె, దిల్లీ, ముంబయి, గురుగ్రామ్, అహ్మదాబాద్, కోల్​కతా, చెన్నై, వడోదరా నగరాల్లోని యూజర్లకు ఇప్పటికే ఈ ఫీచర్ అందుబాటులో ఉంది.

శాంసంగ్​కు మాత్రమే...

ప్రస్తుతానికైతే శాంసంగ్ ఫోన్లకు మాత్రమే 'లవ్ ఇట్ ఆర్ రిటర్న్ ఇట్' అందుబాటులో ఉంది. ఆన్​లైన్ యూజర్లు స్మార్ట్​ఫోన్లను ధైర్యంగా కొనుగోలు చేసేలా ప్రోత్సహించేందుకే ఈ ఫీచర్ తీసుకొచ్చింది ఫ్లిప్​కార్ట్. త్వరలో మరిన్ని కంపెనీలతోనూ జట్టుకట్టే అవకాశం ఉంది!

ఇదీ చదవండి: 'టెస్లా స్టాక్​ అమ్మాలనుకుంటున్నా!- మీరేమంటారు?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.