Davos Annual Meeting: ప్రతీ ఏటా నిర్వహించే ప్రపంచ ఆర్థిక సదస్సు సమావేశాలను వాయిదా వేయాలని సంస్థ నిర్ణయించింది. ఒమిక్రాన్ వ్యాప్తిపై కొనసాగుతున్న అనిశ్చితి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సోమవారం తెలిపింది. ముందస్తుగా అనుకున్న దాని ప్రకారం ఈ సదస్సు జనవరి 17 నుంచి 21 వరకు స్విట్జర్లాండ్‌లోని దావోస్-క్లోస్టర్స్‌లో జరగాల్సి ఉండగా.. దానిని వాయిదా వేసింది. వచ్చే ఏడాది వేసవిలో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
గతేడాది జనవరిలో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ చివరి దావోస్ శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించింది. దీనికి ప్రపంచంలో ఉండే అగ్రనేతలంతా హాజరయ్యారు. కరోనా మహమ్మారి వ్యాప్తి కారణంగా 2021 సమావేశం జరగలేదు. ఈ వార్షిక సమావేశాన్ని తొలుత స్విట్జర్లాండ్‌లో కానీ సింగపూర్‌కు మార్చాలని ముందుగా నిర్వహకులు భావించారు. కానీ చివరకు వాయిదా వేయాల్సి వచ్చింది.
తదుపరి సమావేశాలను ఆన్‌లైన్‌లో నిర్వహించే దిశగా డబ్ల్యూఈఎఫ్ కసరత్తు చేస్తోంది. వీటికి హాజరయ్యేందుకు ఇప్పటికే భారత్ నుంచి పలువురు కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, సీఈవోలు సహా 100కు పైగా ప్రతినిధులు పేర్లు నమోదు చేసుకున్నారు.
ఇదీ చూడండి: పెట్రోల్, డీజిల్‌పై పన్నులు.. కేంద్ర ఖజానాలోకి రూ. 4.55లక్షల కోట్లు