ETV Bharat / business

'ఇక దేశంలో ఎక్కడి నుంచైనా భూ రిజిస్ట్రేషన్!​' - union budget e-passport

Union budget 2022: దేశంలో ఎక్కడి నుంచైనా భూములు రిజిస్ట్రేషన్​ చేసుకునేందుకు సరికొత్త వ్యవస్థను తీసుకురానున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ వెల్లడించారు. అలాగే ఈ-పాస్​పోర్టుల జారీ కోసం కొత్త సాంకేతికతను ఉపయోగించనున్నట్లు చెప్పారు.

one nation one registration
Union budget 2022
author img

By

Published : Feb 1, 2022, 12:29 PM IST

Updated : Feb 1, 2022, 4:18 PM IST

Union budget 2022: కేంద్ర బడ్జెట్​-2022ను పార్లమెంటు ముందుంచారు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్. కేంద్రం నూతనంగా తీసుకొచ్చే భూ సంస్కరణల గురించి కీలక విషయాలు వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఏకీకృత రిజిస్ట్రేషన్ పథకాన్ని(NGDRS) ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. దేశంలో ఎక్కడి నుంచైనా భూములు రిజిస్ట్రేషన్​ చేసుకునేందుకు ఆధునిక వ్యవస్థను తీసుకురానున్నట్లు పేర్కొన్నారు.

అలాగే దేశంలోని పౌరుల సౌకర్యార్థం కోసం ఈ-పాస్​పోర్ట్​లను 2022-23నుంచి జారీ చేయనున్నట్లు నిర్మల తెలిపారు. ఇందుకోసం కొత్త సాంకేతికతను ఉపయోగించనున్నట్లు వివరించారు.

అంతేగాక మానసిక ఆరోగ్య కౌన్సిలింగ్ కోసం 'నేషనల్​ టెలీ మెంటల్​ హెల్త్' కార్యక్రమాన్ని తీసుకురానున్నట్లు నిర్మల తెలిపారు. దేశవ్యాప్తంగా 23 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. 'నేషనల్​ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్​ హెల్త్​ అండ్​ న్యూరోసైన్సెస్'​​ దీనికి నోడల్ సెంటర్​గా ఉంటుందని, ఐఐటీ బెంగళూరు సాంకేతిక సహకారం అందిస్తుందని చెప్పారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

Last Updated : Feb 1, 2022, 4:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.