ETV Bharat / business

వొడాఫోన్‌ ఐడియాకు మరో ఊరట - వొడాఫోన్ ఐడియా ట్రాయ్ వివాదం

ప్రాధాన్య పథకం వివాదానికి తెరపడింది. ఈ విషయంలో వొడాఫోన్‌ ఐడియాపై దర్యాప్తు చేపట్టే నిర్ణయాన్ని ట్రాయ్‌ ఉపసంహరించుకుంది. ఈ పథకం కింద వినియోగదారులకు అత్యధిక డేటా వేగాన్ని అందించే విషయంలో కంపెనీ వెనక్కి తగ్గడం, పథకంలో మార్పులు చేయడం ఇందుకు కారణం.

Trai drops probe against Vodafone Idea on priority plan issue after telco tweaks offer
ప్రాధాన్య పథకంపై వొడాఫోన్‌ ఐడియాకు ఊరట
author img

By

Published : Sep 27, 2020, 6:38 AM IST

ప్రాధాన్య పథకం (ప్రయారిటీ ప్లాన్‌) విషయంలో వొడాఫోన్‌ ఐడియాపై దర్యాప్తు చేపట్టే నిర్ణయాన్ని టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్‌ ఉపసంహరించుకుంది. ఈ పథకం కింద వినియోగదారులకు అత్యధిక డేటా వేగాన్ని అందించే విషయంలో కంపెనీ వెనక్కి తగ్గడం, పథకంలో మార్పులు చేయడం ఇందుకు కారణం. ఈ పరిణామంతో ప్రాధాన్య పథకం వివాదానికి తెరపడినట్లయ్యింది.

వారికి ప్రాధాన్యంతో పథకం

ప్రీమియం వినియోగదారులకు నెట్‌వర్క్‌ విషయంలో ప్రాధాన్యం, అత్యధిక వేగం అందిస్తామంటూ వొడాఫోన్‌ ఐడియా పేర్కొనడంపై విచారణ చేపట్టాలని ట్రాయ్‌ భావించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి గత నెలలో వొడాఫోన్‌ ఐడియాకు షోకాజ్‌ నోటీసులను పంపింది. టారిఫ్‌ ఆఫర్‌ పారదర్శకంగా లేదని, తప్పుదారి పట్టించే విధంగా ఉందని, నియంత్రణ నిబంధనలకూ విరుద్ధంగా ఉందని అందులో పేర్కొంది.

వెనక్కి

ట్రాయ్‌ నుంచి ఒత్తిడి పెరగడంతో ప్రాధాన్య పథకం కింద వినియోగదారులకు అత్యధిక డేటా వేగాన్ని అందించే విషయంలో కంపెనీ వెనక్కి తగ్గింది. సవరించిన పథకాన్ని ట్రాయ్‌కు సమర్పించింది. దీంతో దర్యాప్తు/ విచారణను చేపట్టకూడదని నిర్ణయం తీసుకున్నామని వొడాఫోన్‌ ఐడియా లిమిటెడ్‌కు ట్రాయ్‌ సమాచారం ఇచ్చింది. ఇటీవలే వొడాఫోన్‌ ఐడియా అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కోర్టులో భారత్‌పై కేసు గెలిచిన విషయం తెలిసిందే.

ఇదీ చదవండి-కాగ్​ 'జీఎస్​టీ నివేదిక'పై కేంద్రం మండిపాటు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.