ETV Bharat / business

కుప్పకూలిన మార్కెట్ల... ఆర్థిక, వాహన రంగాలు బెంబేలు - సెన్సెక్స్

STOCKS TODAY
నేటి స్టాక్​ మార్కెట్లు
author img

By

Published : May 4, 2020, 9:25 AM IST

Updated : May 4, 2020, 3:58 PM IST

15:55 May 04

ఐసీఐసీఐ బ్యాంక్ 11 శాతం పతనం..

స్టాక్ మార్కెట్లు నేడు రికార్డు స్థాయి నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 2002 పాయింట్ల కోల్పోయి 31,715 వద్దకు చేరింది. నిఫ్టీ 566 పాయింట్ల క్షీణతతో 9,293 వద్ద స్థిరపడింది.

ఆర్థిక, వాహన, లోహ, ఐటీ రంగ షేర్లు అత్యధికంగా నష్టపోయాయి.

30 షేర్ల ఇండెక్స్​లో భారతీ ఎయిర్​టెల్, సన్​ఫార్మా షేర్లు లాభాలను గడించాయి. ఐసీఐసీఐ బ్యాంక్ (10.96 శాతం), బజాజ్ ఫినాన్స్(10.21 శాతం), హెచ్​డీఎఫ్​సీ (10.08 శాతం), ఇండస్​ఇండ్ బ్యాంక్ (9.58 శాతం), యాక్సిస్​ బ్యాంక్(9.40 శాతం) షేర్లు భారీగా నష్టాలను నమోదు చేశాయి.

14:28 May 04

ఆటో షేర్లు 12 శాతం పతనం..

స్టాక్ మార్కెట్లు రికార్డు స్థాయి నష్టాలతో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ దాదాపు 1,920 పాయింట్లు కోల్పోయి 31,800 కొనసాగుతోంది. నిఫ్టీ దాదాపు 550 పాయింట్ల నష్టంతో 9,311 వద్ద ట్రేడవుతోంది.

ఏప్రిల్​లో ఒక్క యూనిట్​ కూడా విక్రయించలేదని వాహన తయారీ సంస్థలు వరుసగా ప్రకటనలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆటో రంగ షేర్లు 12 శాతానికి పైగా పతనమయ్యాయి.

భారతీఎయిర్​టెల్ అనూహ్యంగా 4 శాతానికిపైగా బలపడింది. సన్​ఫార్మా స్వల్ప లాాభాల్లో ట్రేడవుతోంది.  30 షేర్ల ఇండెక్స్​లో ఈ రెండు కంపెనీలు మాత్రమే లాభాల్లో ఉన్నాయి.

ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్​డీఎఫ్​సీ, బజాజ్ ఫినాన్స్, యాక్సిస్ బ్యాంక్, మారుతీ షేర్లు భారీ నష్టాల్లో ఉన్నాయి.

12:07 May 04

భారీ నష్టాలు..

మిడ్ సెషన్​లోనూ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ 1,710 పాయింట్లకుపైగా నష్టంతో 32,007 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 490 పాయింట్లకు పైగా క్షీణతతో 9,367 వద్ద కొనసాగుతోంది.

భారీనష్టాల కారణంగా బీఎస్​ఈ మదుపరుల సంపద మార్కెట్ల ఆరంభంలోనే.. రూ.5.15 లక్షల కోట్లు ఆవిరైంది. బీఎస్​ఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.1,24,26,311.37 కోట్లకు చేరింది.

11:36 May 04

కొనసాగుతున్న నష్టాల మోత..

మిడ్ సెషన్​ ముందు స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ 1,770 పాయింట్లకు పైగా క్షీణతతో 31,946 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 500 పాయింట్లకుపైగా నష్టంతో 9,353 వద్ద ట్రేడవుతోంది.

  • ఆర్థిక, లోహ, ఐటీ రంగాల్లో అమ్మకాల ఒత్తిడి ఎక్కువగా ఉంది.
  • సెన్సెక్స్​ 30 షేర్ల ఇండెక్స్​లో సన్​ఫార్మా మాత్రమే లాభాల్లో ట్రేడవుతోంది.
  • ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్​ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫినాన్స్, హెచ్​డీఎఫ్​సీ, టాటా స్టీల్, టెక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్ షేర్లు భారీ నష్టాల్లో ఉన్నాయి.

10:16 May 04

భారీ పతనం దిశగా సూచీలు..

స్టాక్ మార్కెట్లు భారీ పతనం దిశగా కదులుతున్నాయి. సెన్సెక్స్ దాదాపు 1700 పాయింట్లు కోల్పోయి 32,018 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 490 పాయింట్లకుపైగా నష్టంతో 9,366 వద్ద కొనసాగుతోంది.

ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లైన.. హాంకాంగ్, సియోల్ సూచీలు నష్టాలతో సెషన్ ప్రారంభించాయి. షాంఘై, టోక్యో సూచీలు నేడు సెలవులో ఉన్నాయి. చైనాపై భారీగా సుంకాల వేటు తప్పదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన ప్రభావం మార్కెట్లపై కనిపిస్తోంది.

ముడి చమురు ధరల సూచీ బ్రెంట్​ నేడు ఫ్లాట్​గా కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్​లో బ్యారెల్ ముడి చమురు ధర ప్రస్తుతం 26.41 డాలర్లుగా ఉంది.

30 షేర్ల ఇండెక్స్​లో సన్​ఫార్మా మాత్రమే లాభాల్లో ట్రేడవుతోంది. ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫినాన్స్, టాటా స్టీల్, ఇండస్​ఇండ్​ బ్యాంక్, హీరో మోటోకార్ప్​, హెచ్​డీఎఫ్​సీ షేర్లు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

09:36 May 04

sensex
30షేర్ల ఇండెక్స్ ఇలా..

లాభాల స్వీకరణ..

స్టాక్ మార్కెట్లలో భారీ నష్టాలు కొనసాగుతున్నాయి. లాక్​డౌన్​తో ఆర్థిక వ్యవస్థ కుదేలవుతున్న నేపథ్యంలో.. గత వారం నమోదైన వరుస లాభాలను సొమ్ముచేసుకునే పనిలో పడ్డారు మదుపరులు.

లాభాల స్వీకరణతో.. సెన్సెక్స్ 1,440 పాయింట్లకుపైగా నష్టంతో 32,274 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 420 పాయింట్లకు పైగా క్షీణించి 9,438 వద్ద కొనసాగుతోంది.

ఆర్థిక, లోహ, చమురు, ఐటీ, వాహన రంగాలు అధికంగా అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొంటున్నాయి.

09:05 May 04

వరుస లాభాలకు బ్రేక్​..

స్టాక్ మార్కెట్లు నేడు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్​ 1,290 పాయింట్లకుపైగా నష్టంతో 32,423 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 405 పాయింట్లకుపైగా కోల్పోయి 9,452 వద్ద కొనసాగుతోంది. దేశవ్యాప్త లాక్​డౌన్ పొడిగింపు నిర్ణయంతో మదుపరుల సెంటిమెంట్​ దెబ్బతిని.. అమ్మకాలపై దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది.

సన్​ఫార్మా మినహా 30 షేర్ల ఇండెక్స్​లో మిగతావన్నీ నష్టాల్లో కొనసాగుతున్నాయి.

Last Updated : May 4, 2020, 3:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.