ETV Bharat / business

ఆరంభ లాభాలు ఆవిరి.. నష్టాలతో ముగిసిన మార్కెట్​

stockmarket opens green
లాభాలతో ప్రారంభమైన స్టాక్​మార్కెట్లు
author img

By

Published : May 11, 2020, 9:40 AM IST

Updated : May 11, 2020, 3:55 PM IST

15:43 May 11

లాభాలతో ప్రారంభమైన స్టాక్​మార్కెట్లు చివరకు నష్టాలతో ముగిశాయి. ప్రభుత్వ రంగ బ్యాంకర్లతో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ భేటీ వాయిదా పడటం మార్కెట్ సెంటిమెంట్​ను దెబ్బతీసింది.

బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 81 పాయింట్లు కోల్పోయి 31 వేల 561 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 12 పాయింట్లు నష్టపోయి 9 వేల 239 వద్ద స్థిరపడింది.

లాభనష్టాలతో..

రిలయన్స్ ఇండస్ట్రీస్​, హీరో మోటోకార్ప్, బజాజ్​ ఆటో, మారుతి సుజుకి, టీసీఎస్​ రాణించాయి. ఐసీఐసీఐ బ్యాంకు, నెస్లే ఇండియా, ఎస్​బీఐ, సన్​ఫార్మా, ఏసియన్ పెయింట్స్, ఎన్​టీపీసీ నష్టపోయాయి.  

10:41 May 11

ఈక్విటీ బెంచ్​ మార్క్​ సెన్సెక్స్ ప్రారంభ సెషన్​లో 500 పాయింట్లకు పైగా పెరిగింది. అంతర్జాతీయ సానుకూలతల మధ్య రిలయన్స్ ఇండస్ట్రీస్​, హెచ్​డీఎఫ్​సీ, ఇన్ఫోసిస్​ లాభాలతో దూసుకుపోవడం మార్కెట్ సెంటిమెంట్​ను బలపరిచింది.

ముంబయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 420 పాయింట్లు వృద్ధి చెంది 32 వేల 63 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 122 పాయింట్లు లాభఫడి 9 వేల 374 వద్ద ట్రేడవుతోంది.

ఇవాళ ప్రభుత్వ రంగ బ్యాంకర్లతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో ఉద్దీపనలపై మార్కెట్ వర్గాలు ఆశలు పెట్టుకున్నాయి.

లాభనష్టాల్లో

రిలయన్స్ ఇండస్ట్రీస్​ 3 శాతానికి పైగా 3 లాభాలతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆల్ట్రాటెక్ సిమెంట్, మారుతి సుజుకి, బజాజ్​ ఆటో, ఇండస్​ఇండ్ బ్యాంకు, ఇన్ఫోసిస్​, ఐటీసీ రాణిస్తున్నాయి.

నెస్లే ఇండియా, ఐసీఐసీఐ బ్యాంకు, ఎస్​బీఐ, బీపీసీఎల్​ నేలచూపులు చూస్తున్నాయి.

ఆసియా మార్కెట్లు

షాంఘై, హాంగ్​కాంగ్, టోక్యో, సియోల్ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.

ముడిచమురు

అంతర్జాతీ మార్కెట్​లో ముడిచమురు ధరలు 1.16 శాతం పడిపోయాయి. ప్రస్తుతం బ్యారెల్ ధర 30.61 డాలర్లుగా ఉంది.

రూపాయి విలువ

ఇవాళ ప్రారంభ ట్రేడింగ్​లో రూపాయి విలువ 5 పైసలు తగ్గి.. ఒక డాలరుకు రూ.75.59కు చేరుకుంది.

09:24 May 11

ఉద్దీపనలపై ఆశలతో సెన్సెక్స్ 400 ప్లస్​

స్టాక్​మార్కెట్లు మంచి లాభాలతో ప్రారంభమయ్యాయి. ముంబయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 433 పాయింట్లు వృద్ధి చెంది 32 వేల 75 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 9 వేల 375 వద్ద ట్రేడవుతోంది.

ఔషధ, ఎఫ్ఎమ్​సీజీ రంగాలకు కొనుగోళ్ల మద్దతు లభిస్తుందన్న అంచనాలు సహా బ్యాంకర్లతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భేటీ కానున్న నేపథ్యంలో మార్కెట్లు లాభాలను ప్రోదుచేసుకున్నాయి.

Last Updated : May 11, 2020, 3:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.