ETV Bharat / business

'సంస్కరణలు కొనసాగించాలి'.. కేంద్రానికి పరిశ్రమ సంఘాల అభ్యర్థన - nirmala sitharaman news

Pre Budget Meet 2021: మరికొద్ది రోజుల్లో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ముందస్తు చర్చలకు శ్రీకారం చుట్టారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఈ సందర్భంగా నిర్వహించిన వర్చువల్ సమావేశంలో.. ప్రస్తుతం అమలు చేస్తున్న సంస్కరణలు కొనసాగించాలని పరిశ్రమ సంఘాలు అభ్యర్థించాయి.

nirmala
నిర్మలా సీతారామన్
author img

By

Published : Dec 17, 2021, 6:53 AM IST

Pre Budget Meet 2021: కొవిడ్‌-19 పరిణామాల కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను ఆదుకునేందుకు వచ్చే బడ్జెట్‌లో పన్ను, విధాన స్థిరత్వాన్ని నిర్ధారిస్తూ, సంస్కరణలను కొనసాగించాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను పరిశ్రమ ప్రతినిధులు కోరారు. బడ్జెట్‌ ముందస్తు చర్చల్లో భాగంగా నిర్వహించిన దృశ్య మాధ్యమ కార్యక్రమంలో పరిశ్రమ సంఘాల ప్రతినిధులు మంత్రికి పలు సూచనలు, సలహాలు అందించారు. ప్రైవేటు పెట్టుబడుల్లో ప్రస్తుతం కనిపిస్తున్న పునరుద్ధరణ సంకేతాలను దృఢంగా ఉంచడంలో ప్రభుత్వ చర్యలు తోడ్పాటు అందిస్తాయని వారు తెలిపారు.

  • ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పన కోసం మూలధన వ్యయాలు చేయడం వల్ల వృద్ధికి మద్దతు లభిస్తుందని సీఐఐ అధ్యక్షుడు టీవీ నరేంద్రన్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు.
  • అధిక నియంత్రణ కలిగిన టెలికాం, విద్యుత్‌, మైనింగ్‌ రంగాల్లో వివాద్‌ సే విశ్వాస్‌ పథకాన్ని కొనసాగించాలని అసోచామ్‌ అధ్యక్షుడు వినీత్‌ అగర్వాల్‌ కోరారు.
  • పర్ఫార్మెన్స్‌ బ్యాంక్‌ హామీ (పీబీజీ), ఎర్నెస్ట్‌ మనీ డిపాజిట్‌లను (ఈడీఎం) పొడిగించాలని పీహెచ్‌డీ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ అధ్యక్షుడు ప్రదీప్‌ ముల్తాని విన్నవించారు.
  • రిటైల్‌, ఎంఎస్‌ఎంఈ సంస్థలకు అందించే రూ.2 కోట్ల వరకు రుణాల్ని స్పెషల్‌ మెన్షన్‌ ఖాతా (ఎస్‌ఎంఏ) కింద చూపించేందుకు అనుమతించాలని ఆర్థిక పరిశ్రమ అభివృద్ధి మండలి (ఎఫ్‌ఐడీసీ) డైరెక్టర్‌ రమణ్‌ అగర్వాల్‌ కోరారు.

Nirmala Sitharaman News: ఈ సమావేశంలో ఆర్థిక శాఖ సహాయ మంత్రులు పంకజ్‌ చౌదరి, భగవత్‌ కరాడ్‌, ఆర్థిక కార్యదర్శి టీవీ సోమనాథన్‌, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్‌ సేథ్‌, దీపమ్‌ కార్యదర్శి తుహిన్‌ కాంత పాండే, ప్రధాన ఆర్థిక సలహాదారు సంజీవ్‌ సన్యాల్‌ తదితర ఉన్నతాధికారులు, మ్యూచువల్‌ ఫండ్‌ పరిశ్రమ ప్రతినిధులు, బ్యాంకుల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.