ETV Bharat / business

కేంద్రం కీలక నిర్ణయం- మరింత దిగిరానున్న ఉల్లి ధరలు! - onion price in mumbai

బఫర్ స్టాక్​ను విడుదల చేసి దేశంలో ఉల్లి ధరలను (Onion buffer stock) నియంత్రిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. ప్రధాన మార్కెట్లలో 67,357 టన్నుల ఉల్లిని బఫర్ స్టాక్ ​నుంచి విడుదల చేసినట్లు వెల్లడించింది. దీని ఫలితంగా ఉల్లి ధర మెట్రో నగరాల్లో కేజీకి రూ.42-57 (Onion rate today) మధ్యకు చేరిందని తెలిపింది.

onion prices
ఉల్లి ధరలు
author img

By

Published : Oct 17, 2021, 9:30 PM IST

దేశంలో ఉల్లి ధరలను (Onion rate today) తగ్గించే దిశగా చర్యలు చేపట్టినట్లు కేంద్రం పేర్కొంది. బఫర్ నిల్వలను (Onion buffer stock) విడుదల చేసి ధరలను నియంత్రిస్తున్నట్లు తెలిపింది. ఆలూ, టమాట ధరలను (Tomato price in India) సైతం తగ్గించేందుకు చర్యలు ప్రారంభించినట్లు వెల్లడించింది. (Onion Price)

ఆగస్టు చివరి వారం నుంచి ఉల్లి బఫర్ స్టాక్​ను విడుదల (Onion buffer stock) చేస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. నిల్వ నష్టాలను తగ్గించేందుకు.. 'ముందుగా వచ్చిన స్టాక్​ను ముందుగా విడుదల' చేసే పద్ధతిని పాటిస్తున్నట్లు వెల్లడించింది. దీని ఫలితంగా అక్టోబర్ 14న ఉల్లి రిటైల్ ధర మెట్రో నగరాల్లో రూ.42-57 మధ్యకు (Onion rate today) చేరిందని తెలిపింది. దేశవ్యాప్తంగా సగటు ధర రూ.37.06కు చేరుకుందని పేర్కొంది. హోల్​సేల్ ధర కేజీ రూ.30కి పరిమితమైందని వెల్లడించింది.

67 టన్నులు విడుదల

దేశ సగటు ధర కన్నా అధిక రేటు ఉన్న రాష్ట్రాల్లో బఫర్ స్టాక్​ను విడుదల చేస్తున్నట్లు కేంద్రం తెలిపింది. దిల్లీ, కోల్​కతా, లఖ్​నవూ, పట్నా, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ముంబయి వంటి ప్రధాన మార్కెట్లలో 67,357 టన్నుల ఉల్లిని బఫర్ స్టాక్ ​నుంచి విడుదల చేసినట్లు వెల్లడించింది.

2021-22లో రబీ పంట నుంచి 2.08 లక్షల టన్నుల బఫర్ స్టాక్​ను కేంద్రం ఏర్పాటు చేసింది.

ఇదీ చదవండి: ఆగని బాదుడు.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.