ఎనర్జీ స్టోరేజీ సొల్యూషన్ సంస్థ ఒకాయా పవర్ గ్రూప్(Okaya Power Group) మరో ఎలక్ట్రిక్ స్కూటర్‌తో(Okaya Electric Scooter) ముందుకొచ్చింది. ఫ్రీడమ్ పేరుతో సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను భారత మార్కెట్లో గురువారం విడుదల చేసింది. ఈ స్కూటర్(Okaya Electric Scooter) ధర రూ.69,900 నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే.. ఎవియాన్ ఐక్యూ, క్లాసిక్ ఐక్యూ పేర్లతో రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను ఒకాయా గ్రూప్ విక్రయిస్తోంది.
'ఫ్రీడమ్' స్కూటర్‌ను లిథియమ్-అయాన్, లెడ్-యాసిడ్ బ్యాటరీలతో తీసుకువచ్చినట్లు ఒకాయా గ్రూప్ వెల్లడించింది. హిమాచల్ ప్రదేశ్‌లోని తమ ఉత్పత్తి కేంద్రంలో వీటిని తయారు చేస్తున్నట్లు చెప్పింది. నాలుగు వేరియంట్లలో లభ్యమయ్యే స్కూటర్లను ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. 250 కిలోమీటర్ల దూరం ప్రయాణించవవచ్చని పేర్కొంది.
"భవిష్యత్ అంతా విద్యుత్ వాహనాలదే. అందుకే ఉత్తమమైన నాణ్యతతో ప్రతి భారతీయుడి డబ్బులకు న్యాయం చేసేలా.. వాహనాలను మేం తీసుకువస్తున్నాం. మా అనుబంధ వ్యాపారాల కారణంగా.. మార్కెట్లో మాకు మంచి ఆదరణ ఉండడం సహజమే."
-అనిల్ గుప్తా, ఒకాయా పవర్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్
హైస్పీడ్ మోటార్ సైకిల్ సహా మరో 14 కొత్త వాహనాలను తీసుకురానున్నట్లు ఒకాయా గ్రూప్ వెల్లడించింది. స్పెషలైజ్డ్ బీ2బీ వాహనాలను తీసుకువస్తామని తెలిపింది. ప్రస్తుతం తమకు 120 మంది డీలర్లు ఉండగా.. భవిష్యత్తులో ఈ సంఖ్యను 800కు పెంచేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు చెప్పింది.
ఇదీ చూడండి: 'ఓలా' గ్రాండ్ ఎంట్రీ- సెకనుకు 4 స్కూటర్ల అమ్మకం