ETV Bharat / business

ఈ పండుగకు కారు కొనే ఆలోచనలో చేస్తున్నారా?

పండుగ సీజన్​, ప్రభుత్వ ఉద్దీపనలను అందిపుచ్చుకుని అమ్మకాలు పెంచుకోవాలని ఆటోమొబైల్​ సంస్థలు భావిస్తున్నాయి. ఇప్పటికే మారుతీ సుజుకీ పండుగ ఆఫర్లు ప్రకటించింది. ఈ బాటలోనే మరిన్ని సంస్థలు త్వరలో ఆఫర్లు తీసుకువస్తాయని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి.

car sales
author img

By

Published : Sep 26, 2019, 5:19 PM IST

పండుగ సీజన్ నేపథ్యంలో వాహనాల అమ్మకాలు పెంచుకునే దిశగా ప్రణాళిక వేస్తున్నాయి దిగ్గజ ఆటోమొబైల్ సంస్థలు. మాంద్యాన్ని ఎదుర్కొనేందుకు కార్పొరేట్​ సుంకాన్ని తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ఉద్దీపన సానుకూలతలను అందిపుచ్చుకోవాలని వాహన సంస్థలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే కార్పొరేట్ సుంకాల కోతతో.. వాహనాల అమ్మకాలు పెరుగుతాయా అన్న సందిగ్ధం ఆటోమొబైల్​ సంస్థల్లో ఉంది. గత కొన్నేళ్లలో ఎప్పుడూ లేనంతగా ఇటీవల వాహన అమ్మకాలు క్షీణించాయి. ఈ నేపథ్యంలో విక్రయాలు పెంచుకునేందుకు జీఎస్టీ తగ్గించాలని కేంద్రానికి విన్నవించాయి ఆటో మొబైల్ సంస్థలు. వాహన తయారీ సంస్థల డిమాండును కేంద్రం పక్కన పెట్టింది.

ప్రస్తుతం ఆఫర్లు ప్రకటించి.. వినియోగదారులను ఆకర్షించే వరుసలో మారుతీ సుజుకీ ముందుంది. ఈ సంస్థ ఇప్పటికే.. ఆల్టో 800, ఆల్టో కే10, స్విఫ్ట్​ డీజిల్​, సెలెరియో, బలెనో డీజిల్​, ఇగ్నీస్​, డిజైర్​ డిజిల్​, టూర్​ ఎస్​ డీజిల్​లపై సహా ఎక్కువగా అమ్ముడయ్యే మోడళ్లపై రూ.5,000 ధర తగ్గించింది. తగ్గిన ధరలు తక్షణమే అందుబాటులోకి వస్తాయని.. ప్రస్తుతమున్న ఆఫర్లకు ఇది అదనమని మారుతీ సుజుకీ స్పష్టం చేసింది. ఈ తగ్గింపుతో అమ్మకాలు భారీగా పెరుగుతాయని మారుతీ ఆశాభావం వ్యక్తం చేసింది.

మారుతీతో పాటు పియాజ్జియో ఇండియా, ఇసూజూ మోటార్స్​ ఇండియా పండుగ సీజన్​ ప్రత్యేక ఆఫర్లు ప్రకటించాయి.

అమ్మకాలు పెరిగేందుకు మరిన్ని అవకాశాలు...

ఆటోమొబైల్ రంగాన్ని ప్రోత్సహించేందుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ గత నెల పలు ఉద్దీపనలు తీసుకువచ్చారు. ఇందులో ముఖ్యంగా ప్రభుత్వ విభాగాలు... వాహనాల కొనుగోలుపై ఉన్న నిషేధం ఎత్తేస్తూ నిర్ణయం తీసుకున్నారు. 2020 మార్చి వరకు వాహనాలపై 15 శాతం అదనపు తరుగుదలను ప్రకటించారు సీతారామన్​. ఈ సానుకూలతలూ.. అమ్మకాల వృద్ధికి ప్రోత్సాహమందిస్తాయని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఇదీ చూడండి: క్రెడిట్​ కార్డ్​పై పెట్రోల్​ రాయితీ ఇక కట్​

AP Video Delivery Log - 0300 GMT News
Thursday, 26 September, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0220: UNGA Australia AP Clients Only 4231800
Australian PM: Plastic pollution choking our oceans
AP-APTN-0119: Mexico Disaster Readiness AP Clients Only 4231825
Mexican armed forces hold readiness drill
AP-APTN-0116: UNGA Zimbabwe AP Clients Only 4231824
Zimbabwe's president demands sanctions relief
AP-APTN-0101: US CA Democrat Donor Drugs Must credit KTTV, No access Los Angeles, No use US broadcast networks, No re-sale, re-use or archive 4231823
Mother reacts to son's death at Dem donor's home
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.