ETV Bharat / business

చుక్కలనంటిన ఫ్లాట్​ ధర.. కొన్నదెవరో తెలుసా?

ముంబయిలోని లోయర్​ పరేల్​లో ఉన్న ఓ ఫ్లాట్ ఈ ఏడాది అత్యధిక ధరకు​(రూ. 136కోట్ల 27లక్షలు) అమ్ముడుపోయింది. మిలియనీర్లు నీరజ్​ కొచర్, కనికా ధ్రువ్​ కొచర్​లు​ ఈ ఫ్లాట్​ను కొనుగోలు చేశారు.

Most expensive flat sold in Mumbai, the whopping amount of the flat will astonish you!
ఈ ఫ్లాట్​ ఖరీదెంతో తెలుస్తే షాక్​ అవ్వాల్సిందే!
author img

By

Published : Jun 28, 2020, 4:50 PM IST

Updated : Jun 29, 2020, 6:13 AM IST

దేశ వాణిజ్య రాజధాని ముంబయిలో ఇళ్ల రేట్లు ఆకాశాన్ని తాకుతాయన్నది తెలిసిన విషయమే. అయితే కరోనా వైరస్​ సంక్షోభంలో అక్కడ ఇళ్ల ధరలు తగ్గుతాయనుకుంటే మాత్రం పొరబడినట్టే. ముంబయిలోని ఓ ఫ్లాట్​ను ఇటీవలే ఓ పారిశ్రామికవేత్త కొనుగోలు చేశారు. దాని విలువ అక్షరాలా రూ. 136కోట్ల 27లక్షలు.

రూ.8కోట్ల నగదు..

భారత్​లోనే అతిపెద్ద స్టెయిన్​లెస్​ స్టీల్​ తయారీదారుల్లో ఒకటైన విరాజ్​ ప్రొఫైల్​ లిమిటెడ్​ సంస్థ ఛైర్మన్​ నీరజ్​ కొచర్.​ నీరజ్​ కొచర్​, కనికా ధ్రువ్​ కొచర్​లు ముంబయిలోని లోయర్​ పరేల్​లో ఓ ఫ్లాట్​ను కొనుగోలు చేశారు. దీని ఖరీదు రూ. 136కోట్ల 27లక్షలు.

ఈ ఏడాదిలో ఒక ఫ్లాట్​కు వెచ్చించిన ధరల్లో ఇదే అత్యధికం. కరోనా సంక్షోభంతో కుదేలైన రియల్​ ఎస్టేట్​ రంగానికి ఇది కచ్చితంగా ఈ వార్త ఉత్తేజాన్ని అందిస్తుంది.

ముంబయిలో లాక్​డౌన్​ను విధించడానికి 2, 3రోజుల ముందు ఫ్లాట్​ను రిజిస్ట్రర్​ చేయించుకున్నారు కొచర్​. రూ.8కోట్ల 17లక్షలను నగదు రూపంలో చెల్లించారు.

అంతకన్నా ముందు లోయర్​ పరేల్​లోని ఇండియా బుల్స్​ టవర్​లో నాలుగు ఫ్లాట్లను కొనుగోలు చేశారు నీరజ్​. అది 21,004 చదరపు అడుగులు. ఒక్కో చదరపు అడుగు రూ. 64,878కు అమ్ముడుపోయింది.

2018లో నీరజ్​ 120కోట్ల రూపాయలతో మరో ఫ్లాట్​ను కొనుగోలు చేశారు. 2019లో ఆర్​కే స్టూడియో రూ. 250కోట్లు వెచ్చించి ముంబయిలో ఓ ఇంటిని కొనుగోలు చేసింది. 2020లో ఇప్పటివరకు నీరజ్​ కొనుగోలు చేసిందే అత్యధికం.

ఇదీ చూడండి- భారత అంకురాల్లో 12 రెట్లు పెరిగిన చైనా పెట్టుబడులు

Last Updated : Jun 29, 2020, 6:13 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.