దేశీయ అతిపెద్ద ఆటో మొబైల్ సంస్థ మారుతీ సుజుకీ.. కార్ల ధరలు మరోసారి పెంచింది. హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్లోని స్విఫ్ట్ సహా.. అన్ని సీఎన్జీ మోడళ్ల ధరలను (దిల్లీ ఎక్స్ షోరూం) రూ.15,000 వరకు పెంచుతున్నట్లు సోమవారం ప్రకటించింది.
ముడిసరకు వ్యయాలు భారం కారణంగా కార్ల ధరల పెంపు తప్పడం లేదని మారుతీ సుజుకీ వెల్లడించింది. పెరిగిన ధరలు తక్షణమే (జులై 12) అమలులోకి రానున్నట్లు స్పష్టం చేసింది.
ధరల పెంపునకు ముందు స్విఫ్ట్ కారు ధర వేరియంట్ల వారీగా (దిల్లీ ఎక్స్ షోరూం ప్రకారం) రూ.5.73 లక్షల నుంచి రూ.8.27 లక్షల మధ్య ఉండేది.
మారుతీ సుజుకీ సీఎన్జీ విభాగంలో.. ఆల్టో, సెలెరియో, ఎస్-ప్రెస్సో, వ్యాగనార్, ఎకో, ఎర్టిగా వంటి మోడళ్లను విక్రయిస్తోంది. ధరల పెంపునకు ముందు.. వీటి కనీస ధర రూ.4.43గా ఉండగా.. గరిష్ఠ ధర రూ.9.36 వద్ద ఉండేది
ఈ ఏడాది ఇప్పటికే పలు మార్లు ధరలు పెంచింది మారుతీ సుజుకీ. ఏప్రిల్ 16న మోడళ్ల వారీగా.. సగటు ధర 1.6 శాతం పెరిగింది. జనవరి 18న ఎంపిక చేసిన మోడళ్లపై రూ.34 వేల వరకు ధర పెంచింది.
ఇదీ చదవండి: