ETV Bharat / business

జియోకు అమెజాన్ పోటీ- కిరాణా సరకుల కోసం కొత్త యాప్

రిలయన్స్ జియో-వాట్సాప్ తలపెట్టిన జియోమార్ట్ ప్రాజెక్టుగా పోటీగా సరికొత్త కార్యక్రమం ప్రారంభిస్తోంది అమెజాన్. కిరాణా, ఇతర నిత్యావసరాల సరకుల హోమ్ డెలివరీ సేవలు అందుబాటులోకి తెస్తోంది.

'Local Shops on Amazon' launched to enable small retailers sell online
అమెజాన్ బంపర్​ ఆఫర్.. కిరాణా షాప్​లకు 'యాప్​​' సాయం
author img

By

Published : Apr 24, 2020, 11:52 AM IST

దేశవ్యాప్తంగా లాక్​డౌన్​ కారణంగా అన్ని సేవలు బంద్​ అయ్యాయి. నిత్యావసరాలు అమ్మే దుకాణాలు, అత్యవసర సేవలకు మాత్రమే ఈ ఆంక్షల నుంచి మినహాయింపులు ఉన్నాయి. ఇలాంటి సమయంలో కిరాణా, చిన్నస్థాయి వ్యాపారులు, రిటైల్​ వర్తకులకు బంపర్​ ఆఫర్​ ఇచ్చింది అమెజాన్​ సంస్థ.

'లోకల్​ షాప్స్​ ఆన్​ అమెజాన్'​...

వ్యాపారులను భాగస్వాముల్ని చేసేందుకు 'లోకల్​ షాప్స్​ ఆన్​ అమెజాన్​' అనే కార్యక్రమం ప్రారంభించింది. ఈ సర్వీసు సాయంతో తమ దుకాణాల్లోని సరకులను వినియోగదారులకు ఆన్​లైన్​లోనే అమ్ముకునే అవకాశం కల్పిస్తోంది. ఇప్పటికే 5వేల మంది వ్యాపారులను భాగస్వామ్యం చేసి ఆరునెలల పైలట్​ ప్రాజెక్టుగా దీన్ని అమలు చేస్తున్నట్లు తెలిపింది. ఇందుకోసం రూ.10 కోట్ల పెట్టుబడి పెట్టింది.

ఎలా ఉపయోగం..?

దుకాణదారుడు రెండు రోజుల్లో సరకులు సరఫరా చేయాల్సి ఉంటుంది. అందుకే వ్యాపారులు దగ్గరల్లోని ప్రాంతాలనే ఎంచుకోవాలి. పిన్​కోడ్​ను కీలకంగా తీసుకుంటారు. అమెజాన్​ డెలివరీ యాప్​ ద్వారా సరకు ట్రాకింగ్​, షిప్​మెంట్​ వివరాలు తెలుసుకునే వీలుంటుంది.

ఈ విధానం ద్వారా రిటైలర్లు, వర్తకులు తమ ఉత్పత్తులను స్థానికంగా సరఫరా చేసుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న డెలివరీ వ్యవస్థతో వినియోగదారులకు వేగంగా సరకులు చేరవేయవచ్చని తెలిపింది అమెజాన్​.

జియో-వాట్సాప్​ వల్లే!

వాట్సాప్ సాయంతో కిరాణా సరుకులను ఆర్డర్​ తీసుకునేలా ప్రణాళికలు రచిస్తోంది జియోమార్ట్​. ఇప్పటికే ఈ అంశంపై అధికారిక ప్రకటన చేసింది. ఇది కిరాణా షాప్​ యజమానులు, చిన్న వ్యాపారాలకు లాభసాటిగా ఉంటుందని తెలిపింది. ఈ నేపథ్యంలో తమ వ్యాపారాన్ని, వినియోగదారులను కాపాడుకునేందుకు అమెజాన్​ కూడా ముందడుగు వేసినట్లు నిపుణులు భావిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.