ETV Bharat / business

WhatsApp: విసిగించే నోటిఫికేషన్లకు విరుగుడు - వాట్సాప్‌ నోటిఫికేషన్లు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి?

వాట్సాప్ యూజర్ల నుంచి ఎక్కువగా వినిపించే మాట నోటిఫికేషన్లు ఇబ్బంది పెడుతున్నాయని. మరి అవి రాకుండా చేసే ఓ ఫీచర్​ ఉందని మనలో చాలామందికి తెలియదు. కుప్పలుగా వచ్చే ఈ నోటిఫికేషన్లకు గుడ్​బై చెప్పెయ్యండిలా..

WhatsApp
వాట్సాప్
author img

By

Published : Jul 11, 2021, 6:10 PM IST

వాట్సాప్‌ లేని స్మార్ట్‌ఫోన్‌ ఉండదంటే నమ్మశక్యం కాదు. చిన్న శబ్దం వచ్చినా సరే మెసేజ్‌ వచ్చిందేమోనని చాలా మంది చూసుకుంటూ ఉంటారు. ఇప్పుడంతా వర్క్‌ ఫ్రం హోమ్‌, ఆన్‌లైన్‌ క్లాస్‌లు.. దీంతో వాట్సాప్‌ వినియోగం కూడా బాగా పెరిగిపోయింది. అయితే.. భారీగా వచ్చే వాట్సాప్‌ నోటిఫికేషన్లతో చిరాకుగా ఉంటుందని పలువురు వాపోతుంటారు. మరి ఇలాంటి నోటిఫికేషన్లు ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ ఫోన్లలో రాకుండా, మళ్లీ కావాల్సినప్పుడు వచ్చేలా ఏం చేయాలో తెలుసుకుందాం.!

చాలా సింపుల్‌..

  • ఆండ్రాయిడ్‌ యూజర్‌ అయితే మీ ఫోన్‌లోని సెట్టింగ్స్‌ ఓపెన్‌ చేయండి.
  • నోటిఫికేషన్‌ సెక్షన్‌ క్లిక్‌ చేయాలి
  • అందులో వాట్సాప్‌నకు ఎదురుగా ఉండే బాక్స్‌ను ఆఫ్‌ చేసేయండి
  • నోటిఫికేషన్స్‌ రావాలంటే మళ్లీ సెట్టింగ్స్‌ క్లిక్‌ చేసి నోటిఫికేషన్‌ సెక్షన్‌కు వెళ్లి వాట్సాప్‌ను ఎనేబుల్‌ చేసేయడమే..

ఐఓఎస్‌లోనూ..

  • ఐఫోన్‌లోని సెట్టింగ్స్‌కు వెళ్లాలి.
  • నోటిఫికేషన్స్‌ క్లిక్‌ చేయాలి
  • ALLOW నోటిఫికేషన్స్‌ను డిజేబుల్‌ చేసేయాలి
  • నోటిఫికేషన్స్‌ రావాలంటే మళ్లీ ఎనేబుల్‌ చేస్తే సరిపోతుంది

ఆండ్రాయిడ్‌ ఫోన్లకు మరో మార్గం..

  • ఆండ్రాయిడ్ యూజర్లు వాట్సాప్‌ యాప్ మీద క్లిక్‌ చేయండి
  • యాప్‌ ఇన్‌ఫో ఓపెన్ చేయాలి.
  • ఇందులో నోటిఫికేషన్స్‌ సెక్షన్‌ క్లిక్‌ చేసేయండి.
  • షో నోటిఫికేషన్స్‌ను ఆఫ్‌ చేయండి.
  • దీంతో మీ వాట్సాప్‌నకు వచ్చే మెసేజ్‌ నోటిఫికేషన్లు కనిపించవు.
  • తీరిక వేళల్లో మీ వాట్సాప్‌ను ఓపెన్ చేసుకుని మెసేజ్‌లను చదువుకోవచ్చు.
  • మళ్లీ నోటిఫికేషన్లు రావాలంటే.. వాట్సాప్‌ మీద క్లిక్‌ చేసి యాప్‌ ఇన్‌ఫో ఓపెన్‌ చేయాలి.
  • నోటిఫికేషన్స్ సెక్షన్‌కు వెళ్లి ఆన్‌ చేసేయడమే.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.