జియోఫోన్ నెక్ట్స్ (JioPhone Next Price) ధరను ప్రకటించింది రిలయన్స్ సంస్థ. ఈ ఫోన్ ధరను రూ. 6,499గా నిర్ణయించింది. ఈ ఏడాది దీపావళి నుంచి జియోఫోన్ నెక్స్ట్ మార్కెట్లోకి విడుదల కానున్నట్లు తెలిపింది. వినియోగదారులు ముందుగా రూ.1,999 చెల్లించి, ఫోన్ తీసుకుని.. మిగిలిన మొత్తాన్ని ఈఎంఐలుగా కట్టవచ్చని వెల్లడించింది. నాలుగు రకాల ఆఫ్షన్స్‌తో ఈఎంఐ సదుపాయం కల్పించనుంది.
ఇప్పటికే జియోఫోన్ నెక్ట్స్‌కు సంబంధించి అప్డేట్స్ను(JioPhone Next latest news) వీడియో రూపంలో విడుదల చేసింది జియో.
జియోఫోన్ నెక్ట్స్ హైలెట్స్..
- జియోఫోన్ నెక్ట్స్ (JioPhone Next news) కోసం గూగుల్, జియో సంయుక్తంగా సరికొత్త ప్రగతి ఆపరేటింగ్ సిస్టమ్‌ను(ఓఎస్) రూపొందించాయి.
- క్వాల్క్రమ్ స్నాప్‌డ్రాగన్ 215 క్యూఎమ్215 ప్రాసెసర్‌ను ఉపయోగిస్తున్నారు.
- 5.45 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే
- 3500 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం
- 13 ఎంపీ బ్యాక్ కెమెరా, 8ఎంపీ ఫ్రంట్ కెమెరా
- 2 జీబీ ర్యామ్, 32జీబీ ఇంటర్నల్ మెమొరీ 4జీ నెట్‌వర్క్‌కు సపోర్ట్
- ధర.. రూ. 6,499
జియోఫోన్ నెక్ట్స్ (JioPhone Next news) కోసం గూగుల్, జియో సంయుక్తంగా సరికొత్త ప్రగతి ఆపరేటింగ్ సిస్టమ్‌ను(ఓఎస్) రూపొందించాయి. తక్కువ ధరకు గొప్ప అనుభూతిని అందిస్తూనే.. అందరినీ 'ప్రగతి'లోకి తీసుకురావాలనే లక్ష్యంతో జియో, గూగుల్‌లోని అత్యుత్తమ టెకీలు దీనిని అభివృద్ధి చేశారని జియో ప్రతినిధులు వెల్లడించారు.
ఈ ఓఎస్‌ను కేవలం భారత్ కోసమే అభివృద్ధి చేసినట్లు పేర్కొన్నారు.
ఇదీ చూడండి: సరికొత్త ఓఎస్‌తో జియోఫోన్ నెక్స్ట్.. ప్రత్యేకతలు ఇవే...