ETV Bharat / business

ITRs For FY21: ఐటీ రిటర్నులు దాఖలు చేసిన 5.89 కోట్ల మంది - సీబీడీటీ ఇ-ఫైలింగ్ పోర్టల్

ITRs For FY21: డిసెంబరు 31 నాటికి 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి దాదాపు 5.89 కోట్ల ఆదాయపు పన్ను రిటర్నలు(ఐటీఆర్​) ఇ-ఫైలింగ్ పోర్టల్​లో దాఖలయ్యాయి. ఈ నేపథ్యంలో సకాలంలో ఐటీఆర్​లు దాఖలు చేసిన పన్ను చెల్లింపుదారులకు ఆదాయపు పన్ను శాఖ కృతజ్ఞతలు తెలిపింది.

ITRs For FY21
2020-2021లో ఐటీఆర్​లు
author img

By

Published : Jan 1, 2022, 5:30 PM IST

ITRs For FY21: మార్చితో ముగిసే 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నిర్దేశించిన డిసెంబరు 31 గడువులోగా... దాదాపు 5.89 కోట్ల ఆదాయపు పన్ను రిటర్నులు(ఐటీఆర్​) ఇ-ఫైలింగ్​ పోర్టల్​లో దాఖలయ్యాయని ఆదాయపు పన్ను శాఖ శనివారం వెల్లడించింది. ఇందులో 46.11 లక్షల ఐటీఆర్​లు చివరిరోజైన డిసెంబరు 31న దాఖలయ్యాయని చెప్పింది.

మొత్తం 5.89కోట్ల ఐటీఆర్​లలో ఐటీఆర్​1​లో 2.92కోట్ల రిటర్నులు, ఐటీఆర్​2(54.8లక్షలు), ఐటీఆర్​3(71.05 లక్షలు), ఐటీఆర్​4(1.60కోట్లు), ఐటీఆర్​5(7.66 లక్షలు), ఐటీఆర్​6(2.58 లక్షలు), ఐటీఆర్7(0.67లక్షలు) దాఖలయ్యాయని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) తెలిపింది.

"మొత్తం ఐటీఆర్​లలో 45.7శాతానికిపైగా... పోర్టల్​లోని ఐటీఆర్ ఫామ్ ద్వారా దాఖలయ్యాయి. మిగతావి ఆఫ్​లైన్​లో దాఖలయ్యాయి. పన్నుచెల్లింపుదారులు ఐటీఆర్​లు దాఖలు చేయడంలో ఇబ్బందులు కాకుండా ఉండేందుకు మేం నిరంతరం ప్రయత్నించాం" అని సీబీడీటీ పేర్కొంది. సకాలంలో ఐటీఆర్​లు దాఖలు చేసినందుకుగాను పన్నుచెల్లింపుదారులకు ఆదాయపు పన్ను శాఖ కృతజ్ఞతలు తెలిపింది.

అయితే.. 2020-21 మదింపు సంవత్సరానికి సంబంధించి నిర్దేశించిన 2021 జనవరి 10 గడువునాటికి 5.95 కోట్ల ఐటీఆర్​లు దాఖలు కావడం గమనార్హం. 2021 జనవరి 10నే 31.05 లక్షల ఐటీఆర్​లు దాఖలయ్యాయి.

ఇదీ చూడండి: GST Collection: వరుసగా ఆరో నెలా రూ.లక్ష కోట్లు దాటిన జీఎస్టీ వసూళ్లు

ఇదీ చూడండి: LPG Cylinder Price: గుడ్​ న్యూస్​.. తగ్గిన గ్యాస్ ధర

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.