ETV Bharat / business

'భారత్​లో రూ.2,000 కోట్ల పెట్టుబడులు పెడతాం'

ప్రముఖ కార్ల తయారీ సంస్థ టయోటా... దేశంలో రానున్న 12 నెలల్లో రూ.2000కోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు సంస్థ వైస్​ ఛైర్మన్​ విక్రమ్​ కిర్లోస్కర్​ తెలిపారు. ఈ క్రమంలో అధిక పన్నుల కారణంగా భారత్‌లో విస్తరించబోమని కంపెనీ సీనియర్‌ అధికారి ప్రకటనను ఖండించారు.

author img

By

Published : Sep 16, 2020, 9:01 AM IST

Investing over Rs 2,000 cr on electrification of models: TKM
'భారత్​లో రూ.2,000 కోట్ల పెట్టుబడులు పెడతాం'

వచ్చే 12 నెలల్లో భారత్‌లో రూ.2000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌ వైస్‌ ఛైర్మన్‌ విక్రమ్‌ కిర్లోస్కర్‌ ధ్రువీకరించారు. అధిక పన్నుల కారణంగా భారత్‌లో విస్తరించబోమని కంపెనీ సీనియర్‌ అధికారి ప్రకటనను ఖండించారు. కార్లు, మోటార్‌బైక్‌లపై ప్రభుత్వ పన్నులు చాలా అధికంగా ఉన్నాయని.. ఈ నేపథ్యంలో విస్తరణను నిలిపివేయనున్నట్లు కంపెనీ వైస్‌ ఛైర్మన్‌, పూర్తి కాల సభ్యుడు శేఖర్‌ విశ్వనాథన్‌ అంతక్రితం బ్లూమ్‌బర్గ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

అయితే కేంద్ర పరిశ్రమల మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ దీనిపై స్పష్టతనిస్తూ 'టయోటా కంపెనీ భారత్‌లో పెట్టుబడులను నిలిపివేయనున్నదన్న వార్త అసత్యం. వచ్చే 12 నెలల్లో రూ.2000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు విక్రమ్‌ కిర్లోస్కర్‌ తెలిపారు' అని ట్వీట్‌ చేశారు.

ఈ ట్వీట్‌కు స్పందిస్తూ 'నిజమే. మేం విద్యుత్‌ విడిభాగాలు, సాంకేతికతపై భారత్‌లో రూ.2000 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టనున్నాం. భవిష్యత్‌ భారతానికి మేం కట్టుబడి ఉన్నామ'ని విక్రమ్‌ కిర్లోస్కర్‌ పేర్కొన్నారు. గిరాకీ పెరుగుతోందని.. మార్కెట్‌ క్రమంగా పుంజుకుంటుందని ఆయన వ్యాఖ్యానించారు. పరిశ్రమకు, ఉద్యోగాలకు అవసరమైన మద్దతును ప్రభుత్వం ఇస్తుందన్న విశ్వాసం మాకుందని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది.

ఇదీ చూడండి: మార్కెట్​లోకి యాపిల్‌ కొత్త వాచీలు.. ఐప్యాడ్​లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.