ETV Bharat / business

కార్లపై హ్యుందాయ్ అదిరే ఆఫర్లు- కొన్ని రోజులు మాత్రమే! - హ్యుందాయ్​ లేటెస్ట్ ఆఫర్స్​

రాబోయేది పండుగల సీజన్‌. చాలా మంది ఈ సమయంలో కొత్త వాహనాలు కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతారు. ఈ నేపథ్యంలో వినియోగదారులను ఆకర్షించేందుకు హ్యుందాయ్​ (Hyundai) ఇండియా ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. పరిమితకాలం వరకే ఉండే ఈ ఆఫర్ల పూర్తి వివరాలు (Hyundai offers September 2021) ఇలా ఉన్నాయి.

Hyundai Festive offers
హ్యూందాయ్​ పండుగ ఆఫర్లు
author img

By

Published : Sep 13, 2021, 4:10 PM IST

పండుగ సీజన్‌ నేపథ్యంలో వినియోగదారులను ఆకట్టుకునేందుకు వాహన తయారీ సంస్థలు ప్రత్యేక ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. తాజాగా హ్యుందాయ్‌ (Hyundai) ఇండియా పలు మోడళ్లపై వినియోగదారులకు ప్రయోజనాలు ప్రకటించింది. మోడల్‌ను బట్టి దాదాపు రూ.50,000 వరకు రాయితీలు ఉన్నాయి. తాజా ఆఫర్లు శాంత్రో, గ్రాండ్‌ ఐ10 నియోస్‌, ఆరాపై వర్తిస్తాయి. హ్యుందాయ్‌ వెబ్‌సైట్లో ఆఫర్ల జాబితాను ఉంచారు. సెప్టెంబరు 30 వరకు (Hyundai offers September 2021) మాత్రమే ఇవి వర్తిస్తాయి.

గ్రాండ్‌ ఐ10 నియోస్‌పై అత్యధికంగా రూ.50 వేల మేరకు ఆఫర్లను ఇచ్చింది. దీంట్లో రూ.35 వేలు నగదు డిస్కౌంట్‌‌, రూ.10వేలు ఎక్స్‌ఛేంజి బెనిఫిట్‌, రూ.5వేలు కార్పొరేట్‌ డిస్కౌంట్‌ ఉన్నాయి. అయితే, ఈ ఆఫర్‌ కేవలం గ్రాండ్‌ ఐ10 నియోస్‌ టర్బో వేరియంట్‌కు మాత్రమే పరిమితం. ఇతర వేరియంట్లపై గరిష్ఠంగా రూ.35,000 వరకు మాత్రమే లబ్ధి చేకూరనుంది.

Grand i10 neos
గ్రాండ్‌ ఐ10 నియోస్‌పై

శాంత్రో హ్యాచ్‌బ్యాక్‌కు మొత్తం మీద రూ.40 వేల వరకు లబ్ధి దొరకనుంది. వీటిలో రూ.25 వేలు నగదు‌, రూ.10 వేలు ఎక్స్‌ఛేంజ్‌‌‌, రూ.5 వేలు కార్పొరేట్‌ డిస్కౌంట్ల కింద అందజేస్తోంది. దీంట్లోనే ‘ఎరా’ వేరియంట్‌పై రూ.25 వేల వరకు ప్రయోజనాలు ఉన్నాయి. నగదు రాయితీ కింద రూ.10 వేలు, ఎక్స్‌ఛేంజ్‌ రూ.10,000, కార్పొరేట్‌ బోనస్‌ కింద రూ.5,000 వరకు రాయితీ లభించనుంది.

Hyundai Santro
హ్యుందాయ్​ శాంత్రో

ఇక ఆరా మోడల్‌పై అత్యధికంగా రూ.50 వేల లబ్ధి చేకూరనుంది. నగదు రాయితీ రూ.35 వేలు, ఎక్స్‌ఛేంజ్‌ బెనిఫిట్‌‌ రూ.10 వేలు, కార్పొరేట్‌ బోనస్‌ కింద రూ.5,000 రాయితీ అందనుంది. దీనిలోని సీఎన్‌జీ వేరియంట్‌కి నగదు రాయితీ వర్తించదు.

Hyundai aura
హ్యుదాయ్​ ఆరా

హ్యుందాయ్‌కి చెందిన వెన్యూ, క్రెటా, అల్కజార్‌, ఆల్‌ న్యూ ఐ20, ఐ20 ఎన్‌ లైన్‌, టక్సన్‌, కోనా ఎలక్ట్రిక్‌, ఎలెంట్రా, వెర్నాపై మాత్రం ఎలాంటి ప్రయోజనాలు లేవు.

ఇదీ చదవండి: పండుగ ఆఫర్లు- కార్లపై హోండా భారీ డిస్కౌంట్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.