ETV Bharat / business

గుడ్‌న్యూస్‌.. తగ్గనున్న వంటనూనె ధరలు

దేశంలోకి దిగుమతి అవుతున్న ముడి పామాయిల్​, సోయా, సన్​ఫ్లవర్​ ఆయిల్​పై​ బేసిక్​ కస్టమ్స్​ సుంకాన్ని తగ్గించింది కేంద్రం. దీంతో దేశంలో వంట నూనెల ధరలు(edible oil price) దిగిరానున్నాయి.

Edible Oil Prices
వంటనూనె ధరలు
author img

By

Published : Oct 13, 2021, 6:25 PM IST

Updated : Oct 13, 2021, 10:57 PM IST

ఓ వైపు చమురు ధరల మోత, గ్యాస్‌ బండ బాదుడు.. మరోవైపు నిత్యావసర ధరల పెరుగుదలతో సతమతమవుతున్న సామాన్య పౌరుడికి కాస్త ఊరట కలిగించే వార్త ఇది..! పండగల వేళ ప్రజలకు ఉపశమనం కల్పిస్తూ.. ముడి పామాయిల్‌, సోయాబీన్‌, పొద్దుతిరుగుడు నూనెలపై బేసిక్‌ కస్టమ్స్‌ సుంకాన్ని(Basic Custom Duty) కేంద్రం తొలగించింది. అంతేగాక వీటిపై ఉన్న అగ్రిసెస్‌ను కూడా తగ్గించింది. దీంతో దేశీయంగా వంట నూనె ధరలు(Edible oil Rates in India) కాస్త దిగిరానున్నాయి.

గత కొన్ని రోజులుగా దేశీయ మార్కెట్లో వంట నూనెల ధరలు భగ్గుమంటున్న(Edible Oil Rates are Increasing in India) విషయం తెలిసిందే. ఇప్పుడు పండగ సీజన్‌ కావడంతో వినియోగదారులపై మరింత భారం(Cooking Oil Price) పడనుంది. ఈ నేపథ్యంలో ప్రజలకు ఊరటనిచ్చేందుకు దిగుమతి సుంకాలను తగ్గించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు ముడి వంట నూనె రకాలపై బేసిక్‌ కస్టమ్స్‌ సుంకాన్ని తొలగించడంతో పాటు అగ్రిసెస్‌ను(Agri Cess on Edible Oil) కూడా తగ్గించింది.

తాజా నిర్ణయంతో ముడి పామాయిల్‌పై(Palm Oil for Cooking) అగ్రిసెస్‌ 7.5శాతానికి, ముడి సోయాబిన్‌ ఆయిల్‌, ముడి పొద్దుతిరుగుడు నూనెపై 5.5శాతానికి దిగొచ్చింది. ఇక రిఫైన్డ్‌(శుద్ధీకరించిన) వంట నూనెలపైనా బేసిక్‌ కస్టమ్స్‌ సుంకాన్ని 32.5శాతం నుంచి 17.5శాతానికి తగ్గించారు. ఈ తగ్గింపు అక్టోబరు 14న అమల్లోకి వచ్చి 2022 మార్చి 31 వరకు కొనసాగుతుందని కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్‌ బోర్డు బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించింది.

ఇవీ చదవండి:

Last Updated : Oct 13, 2021, 10:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.