బంగారం సోమవారం రూ.238 పెరిగింది. దీనితో దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.56,122 వద్దకు చేరింది.
అంతర్జాతీయ మార్కెట్లో పుత్తడి డిమాండ్, రూపాయి నెమ్మదిగా పుంజుకుంటుండటం వల్ల దేశీయంగా కూడా పసిడి ధరలు పెరుగుతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
వెండి ధర కిలోకు సోమవారం రూ.960 పెరిగింది. కిలో ధర ప్రస్తుతం రికార్డు స్థాయి వద్ద రూ.76,520గా ఉంది.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 2,035 డాలర్లకు పెరిగింది. వెండి ఔన్సుకు 28.31 డాలర్ల వద్ద ఉంది.
ఇదీ చూడండి:ల్యాప్టాప్ల వ్యాపారానికి తొషిబా గుడ్ బై