బంగారం ధర గురువారం రూ.488 తగ్గింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.49,135 వద్దకు చేరింది.
కరెన్సీ మార్కెట్లో రూపాయి గురువారం భారీగా పుంజుకోవడం, స్టాక్ మార్కెట్లు సానుకూలంగా స్పందించడం వంటి పరిణామాలు పసిడి ధరల తగ్గుదలకు ప్రధాన కారణంగా నిపుణులు చెబుతున్నారు.
వెండి ధర కిలోకు ఏకంగా రూ.1,168 (దిల్లీలో) తగ్గింది. కిలో ధర ప్రస్తుతం రూ.50,326 వద్దకు చేరింది.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,769.4 డాలర్ల వద్ద ఫ్లాట్గా ఉంది. వెండి ఔన్సుకు 17.90 డాలర్లుగా ఉంది.
ఇదీ చూడండి:కరోనా యోధులకు ఇండిగో బంపర్ ఆఫర్