ETV Bharat / business

రెండో ప్యాకేజీతో రైతులు, కూలీలకు ఊతం - నిర్మలా సీతారామన్

రెండో ప్యాకేజీలో భాగంగా 9 విభాగాలపై పలు ఉద్దీపన చర్యలు ప్రకటించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఇందులో వలస కార్మికులు, రైతులపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.

NIRMALA SITARAMAN PACKAGE DETAILS
నిర్మలా సీతారామన్
author img

By

Published : May 14, 2020, 4:52 PM IST

Updated : May 14, 2020, 5:15 PM IST

కరోనా భారీ ఆర్థిక ప్యాకేజీ రెండో విడత భాగంగా కీలక చర్యలు చేపట్టిన ప్రభుత్వం... వలస కార్మికులు, వీధి వ్యాపారులు, రైతులపై దృష్టి సారించింది. చిరు వ్యాపారులు, స్వయం ఉపాధి పొందుతున్న వారు, చిన్న రైతులకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. మొత్తం 9 విభాగాలకు ఉద్దీపన చర్యలు ప్రకటించనున్నట్లు స్పష్టం చేశారు. వలస కార్మికులకు సంబంధించి 3, చిన్న, సన్నకారు రైతులకు సంబంధించి 2 కీలక ప్రకటనలు చేయనున్నారు. ముద్ర రుణాలు, ఇళ్ల నిర్మాణం​​, ఉద్యోగ కల్పనపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు

రైతులు

రైతులకు ఇప్పటివరకు 4 లక్షల కోట్ల రుణాలు అందజేసినట్లు తెలిపారు నిర్మలా. మొత్తం 3 కోట్ల మంది కర్షకులు ఈ ప్రయోజనం పొందినట్లు స్పష్టం చేశారు. తక్కువ రేట్లకే ఈ రుణాలు ఇచ్చినట్లు వెల్లడించారు.

చిన్న సన్నకారు రైతులకు గత రెండు నెలల వ్యవధిలో 25 లక్షల కిసాన్ క్రెడిట్ కార్డులు జారీ చేసినట్లు తెలిపారు నిర్మల. వీరికి ఇప్పటికే రూ.25 వేల కోట్ల రుణాలు అందించినట్లు స్పష్టం చేశారు.

రాష్ట్రాలకు పెట్టుబడి సాయం

రైతులకు ప్రత్యక్ష ప్రయోజనం కలిగేలా రాష్ట్రాలకు 6,700 కోట్ల పెట్టుబడి సాయం అందించినట్లు నిర్మల తెలిపారు. రైతుల నుంచి వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేసేందుకు ఈ మొత్తం ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. దీని ద్వారా చిన్న, సన్నకారు రైతుల చేతికి డబ్బు అందుతుందన్నారు.

పట్టణ పేదలకు అండ

పట్టణాల్లో ఇళ్లు లేని పేద వారికి కేంద్రం పూర్తి అండగా ఉన్నట్లు నిర్మల తెలిపారు. వారి పట్ల పూర్తి శ్రద్ధ వహిస్తున్నట్లు వెల్లడించారు. ప్రతీ రోజు మూడు పూటల భోజనం అందిస్తున్నట్లు చెప్పారు. దీనికయ్యే వ్యయం పూర్తిగా కేంద్రమే భరిస్తున్నట్లు స్పష్టం చేశారు.

Last Updated : May 14, 2020, 5:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.