ETV Bharat / business

మేలో కొత్త ఉద్యోగుల సంఖ్య 3.18 లక్షలు

కరోనా లాక్​డౌన్​తో ఏప్రిల్​ భారీగా తగ్గిన కొత్త ఉద్యోగాలు.. మేలో కాస్త పెరిగినట్లు ఈపీఎఫ్​ఓ పేరోల్ డేటా ద్వారా తెలిసింది. మేలో కొత్తగా (సంఘటిత రంగాల్లో)ఉద్యోగాల్లో చేరిన వారిన వారి సంఖ్య 3.18 లక్షలుగా నమోదైనట్లు వెల్లడైంది.

epfo on new jobs
ఈపీఎఫ్​ఓ
author img

By

Published : Jul 22, 2020, 11:15 AM IST

సంఘటిత రంగాల్లో మేలో కొత్తగా ఉద్యోగాల్లో చేరిన వారి సంఖ్య 3.18 లక్షలకు పెరిగింది. ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్​ఓ) పేరోల్ డేటా ద్వారా ఈ విషయం వెల్లడైంది. సంపూర్ణ లాక్​డౌన్​ కారణంగా ఏప్రిల్​లో లక్ష ఉద్యోగాలు మాత్రమే నమోదైనట్లు ఈ డేటాలో తొలుత వెల్లడైంది. అయితే ఇటీవల చేసిన సవరణలతో ఏప్రిల్​లో కొత్తగా ఉద్యోగాల్లో చేరిన వారి సంఖ్య 1.33 లక్షలుగా తేలింది.

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు మార్చి చివరి వారం నుంచి లాక్​డౌన్ అమలు చేసింది కేంద్రం. ఈ నేపథ్యంలో ఉద్యోగ అవకాశాలు ఏప్రిల్​లో రికార్డు స్థాయిలో తగ్గిపోయాయి.

కరోనా విజృంభణకు ముందు మార్చిలో 5.72 లక్షలు, ఫిబ్రవరిలో 10.21 లక్షల మంది కొత్తగా ఉద్యోగాల్లో చేరడం గమనార్హం.

2019-20 ఆర్థిక సంవత్సరంలో కొత్తగా ఈపీఎఫ్ పరిధిలోకి వచ్చిన వారి సంఖ్య 78.58 లక్షలకు పెరిగింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం(2018-19) ఈ సంఖ్య 61.12 లక్షలుగా ఉంది.

ఇదీ చూడండి:ఇకపై గ్రూప్ పాలసీగా కరోనా కవచ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.