ETV Bharat / business

'ఆ కరెన్సీలకు ప్రాథమిక విలువ లేదు' - క్రిప్టో కరెన్సీలు

క్రిప్టో కరెన్సీలకు(Cryptocurrency In India) ప్రాథమిక విలువ లేదని కేంద్ర ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి సుభాష్‌ గార్గ్‌ తెలిపారు. క్రిప్టో కరెన్సీలపై 2017లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీకి ఆయన అధ్యక్షత వహించారు. క్రిప్టో కరెన్సీని పూర్తిగా నిషేధించాలని కమిటీ సిఫారసు చేసింది.

cryptocurrency
క్రిప్టో కరెన్సీలు
author img

By

Published : Nov 26, 2021, 6:35 AM IST

క్రిప్టో కరెన్సీ ఇన్వెస్టర్లు(Cryptocurrency In India) ఒక అదృశ్య భూతాన్ని వెంటాడుతున్నారని, దానిపై వారితో పాటు ఎక్స్ఛేంజీల నిర్వాహకులకు కూడా స్పష్టత లేదని కేంద్ర ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి సుభాష్‌ గార్గ్‌ పేర్కొన్నారు.

'అదేంటో వారికి తెలీదు, అయినా ఏదో విలువైన వస్తువు అనుకుని దాని వెంటపడుతున్నారు, అందుకే క్రిప్టో కరెన్సీల ధరలు పెరిగిపోతున్నాయి'అని అభిప్రాయపడ్డారు. క్రిప్టో కరెన్సీలపై 2017లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీకి ఆయన అధ్యక్షత వహించారు. క్రిప్టో కరెన్సీని పూర్తిగా నిషేధించాలని కమిటీ సిఫారసు చేసింది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. లాభార్జన అనే ఆలోచన తప్పించి, క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్‌తో మరొక ప్రయోజనం లేదని ఆయన విశ్లేషించారు. అందుకే అందరూ క్రిప్టో వెనుక పడుతున్నారని ఇన్‌ఫామిస్ట్‌ ఇంటర్వ్యూలో ఆయన పేర్కొన్నారు. ముఖ్యాంశాలివీ..

క్రిప్టో కరెన్సీని పూర్తిగా నిషేధించాలని మీరు నివేదిక ఇచ్చారు. ఇప్పుడు మీ అభిప్రాయం మారిందా?

అవును.. 2019 తర్వాత ఎన్నో మార్పులు వచ్చాయి. అప్పట్లో క్రిప్టో లోని కరెన్సీనే చూసి, దాన్ని నిషేధించాలని అనుకున్నాం. కానీ బ్లాక్‌చైన్‌ టెక్నాలజీ సృష్టిస్తున్న డిజిటల్‌ వ్యవస్థలో, క్రిప్టో కరెన్సీ ఒక భాగం మాత్రమే. మరెన్నో ఉత్పత్తులు, సేవలు వచ్చాయి. ఈ టెక్నాలజీతో ఎన్నో ప్రోగ్రామ్‌లు ఆవిష్కరించవచ్చు. ఎన్‌ఎఫ్‌టీ (నాన్‌- ఫంజిబుల్‌ టోకెన్స్‌) వంటి విభిన్న డిజిటల్‌ ఆస్తులు సృష్టించవచ్చు. అందువల్ల ఇప్పుడు మనముందున్న అంశం ఎంతో విస్తృతమైంది. కరెన్సీని కాకుండా, ఈ టెక్నాలజీ సృష్టించే వస్తు, సేవలను పరిశీలించి అందులో అవసరం లేని వాటిని నియంత్రించే ఆలోచన చేయాలి.

క్రిప్టోను నియంత్రించే చట్టం ఎలా ఉండాలనేది మీ ఉద్దేశం?

దీన్ని రెండు కోణాల్లో చూడాలి. ఒకటి.. క్రిప్టో కరెన్సీలకు మద్దతుగా పోరాటం చేస్తోంది క్రిప్టో ఎక్స్ఛేంజీలే. క్రిప్టో కరెన్సీలో(Cryptocurrency In India) 'ట్రేడ్‌' చేయాలని అవి ఇన్వెస్టర్లను ఆహ్వానిస్తున్నాయి. క్రిప్టోపై నిషేధం విధించరాదని సుప్రీంకోర్టుకు వెళ్లాయి. ప్రపంచ వ్యాప్తంగా 8,000కు పైగా క్రిప్టో కరెన్సీలు ఉన్నాయి. వాటిని రూపొందించింది ఎక్స్ఛేంజీలు కాదు. అవి కేవలం ట్రేడింగ్‌ ప్లాట్‌ఫామ్స్‌ మాత్రమే. రెండో అంశం.. క్రిప్టో కరెన్సీలకు ప్రాథమిక విలువ అనేది లేదు. అవి కేవలం ట్రేడింగ్‌ సాధనాలే. క్రిప్టో ఎక్స్ఛేంజీలకు విలువ కట్టొచ్చు కానీ, క్రిప్టో కరెన్సీల విలువ నిర్థారించలేం. క్రిప్టో కరెన్సీ సృష్టించే ఆస్తులు ఏమిటో.. తెలియడం లేదు. ఈ సందిగ్ధత ఉన్నంత కాలం క్రిప్టో నియంత్రణ అత్యంత సంక్లిష్ట అంశం.

క్రిప్టో కరెన్సీలను చట్టబద్ధం చేయొచ్చా?

ఒకటి, రెండు దేశాలు చేశాయి. కానీ సాధారణ కరెన్సీ మాదిరిగా క్రిప్టో కరెన్సీలను అనుమతించడం సరికాదు. ట్రేడింగ్‌ ప్లాట్‌పామ్‌లో కనిపించే కరెన్సీ వేరు, బయట చెలామణీలో కరెన్సీ ఉండటం వేరు. సాధారణ కరెన్సీ డిజిటల్‌లోకి మారొచ్చు. ఎందుకంటే దానికి వాస్తవ రూపం ఉంది కాబట్టి. ప్రపంచ వ్యాప్తంగా యూఎస్‌డీటీ, యూఎస్‌డీసీ తప్పిస్తే.. మిగిలిన క్రిప్టో కరెన్సీలు సాధారణ కరెన్సీ మాదిరిగా లేవు. బిట్‌ కాయిన్‌ను కూడా సాధారణ కరెన్సీగా వాడటం లేదు. దాన్నొక ఆస్తిగా చూస్తున్నారంతేే. అందువల్ల క్రిప్టో కరెన్సీలను చట్టబద్ధం చేయడం వీలుకాకపోవచ్చు.

ఇన్వెస్టర్లను క్రిప్టో పరిశ్రమ తప్పుదోవ పట్టిస్తోందా?

ఎంత ఎక్కువమంది వచ్చి క్రిప్టో కరెన్సీలపై ట్రేడ్‌ చేస్తే ఎక్స్ఛేంజీలకు అంత మంచిది. వాటికి టర్నోవర్‌, లాభాలు కావాలి. అంతకు మించి వాటికి వేరే ఆసక్తి ఉండదు. 'క్రిప్టో కరెన్సీ ధర తగ్గిందా, పెరిగిందా, ఎవరికి లాభం వచ్చింది, ఎవరు నష్టపోయారు' అనేది వాటికి అనవసరం. మరోపక్క ఇన్వెస్టర్లకు క్రిప్టో కాయిన్లు కొని, అమ్మితే లాభం వస్తుందనే ఆశ ఉంటుంది. అందువల్ల ఎక్కువ మందిని ఆకర్షించేందుకు వాస్తవ విరుద్ధమైన పరిస్థితులను క్రిప్టో పరిశ్రమ సృష్టిస్తోందని అనుకోవచ్చు.

ప్రస్తుత పరిస్థితులను చూస్తే.. క్రిప్టో వ్యవహారం గాలిబుడగ మాదిరిగా కనిపిస్తోందా?

అవును, అలాగే ఉంది. 'స్క్విడ్‌ గేమ్‌ టోకెన్‌'ను చూడండి, ఒక్కరోజులో 15- 16 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.1,12,500-1,20,000 కోట్ల) నుంచి కుప్పకూలిపోయింది. 'ఎథేరియమ్‌' వంటి ప్లాట్‌ఫామ్‌లు కొంత నయం. అవి ఎంతో కొంత విలువ సృష్టించాయి. ఎంత విలువనేది నిర్ధారించలేం కానీ, ఒక్క రోజులో తెరమరుగయ్యేది కాదు. కొన్ని ఎన్‌ఎఫ్‌టీలు మాత్రం పూర్తిగా మోసపూరితమే.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.