'కొవాగ్జిన్' టీకాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) నుంచి అత్యవసర గుర్తింపు పొందేందుకు అన్ని రకాలుగా కృషి చేస్తున్నట్లు భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ వెల్లడించింది. 'ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తింపు ఎప్పుడు వస్తుందనే విషయంలో ఊహాగానాలు, అంచనాలు సరికాదు, ఈ విషయంలో మా వైపు నుంచి చేయగలిగిందంతా చేస్తున్నాం' అని భారత్ బయోటెక్ మంగళవారం 'ట్విట్టర్'లో పేర్కొంది.
'కొవాగ్జిన్' టీకాకు సంబంధించి అదనపు సమాచారాన్ని డబ్ల్యూహెచ్‌ఓ కోరినట్లు, అందువల్ల దీనికి అత్యవసర గుర్తింపు ఆలస్యం కావచ్చనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కంపెనీ స్పందించింది. డబ్ల్యూహెచ్‌ఓకు చెందిన నిపుణుల బృందం వచ్చే నెల 5న సమావేశమైన కొవాగ్జిన్ టీకాకు అనుమతి అంశాన్ని పరిశీలించే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇదీ చూడండి: చిన్నపిల్లలపై సీరం వ్యాక్సిన్ ప్రయోగ పరీక్షలకు అనుమతులు