ETV Bharat / business

డబ్బులెలా ఖర్చుపెట్టొద్దో చెప్పిన ఆనంద్‌ మహీంద్రా! - సంపన్నుల వృథా ఖర్చులైప ఆనంద్ మహీంద్రా ట్వీట్​

ఆనంద్​ మహీంద్రా.. తీరిక లేని వ్యాపార కార్యకలాపాల్లో ఉన్నప్పటికీ.. సామాజిక అంశాలపై ఎప్పటికప్పుడు తన అభిప్రాయాన్ని ట్విట్టర్​లో షేర్​ చేస్తుంటారు. అలానే ఇటీవల డబ్బులు ఎలా ఖర్చు చేయకూడదో చెబుతూ ఓ ట్వీట్​ చేశారు. ఆ ట్వీట్​లో ఏముందో ఇప్పుడు చూద్దాం.

Anand Mahindra on Wasteful expenses
వృథా ఖర్చులపై ఆనంద్​ మహీంద్రా స్పందన
author img

By

Published : Jul 21, 2021, 12:37 PM IST

ట్రెండింగ్‌ అంశాలతో నిత్యం సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉండే వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రా.. తాజాగా ప్రజలకు ఓ పాఠం నేర్పించారు. డబ్బులు వృథాగా ఎలా ఖర్చు చేయకూడదో సొదాహరణంగా చూపించారు. ఈ మేరకు ట్విటర్‌లో ఓ వీడియోను పోస్ట్‌ చేశారు. వివరాల్లోకి వెళితే..

అమెరికాలో భారత సంతతికి చెందిన ఓ వ్యక్తి తన ఫెరారీ కారేసుకొని వీధుల్లో చక్కర్లు కొడుతున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అయితే, దీంట్లో ఉన్న ప్రత్యేకత ఏమిటని ఆరా తీస్తే.. అది పూర్తిగా బంగారు పూత పూసిన కారని వీడియో ద్వారా తెలుస్తోంది. ఓ ఇద్దరు వ్యక్తులు దాంట్లో కూర్చుని వీధుల్లో చక్కర్లు కొడుతున్నారు. దాన్ని చూసి చుట్టుపక్కల వారంతా ఆశ్యర్యపోతూ ఫొటోలు తీసుకుంటున్నారు. ఈ వీడియోపైన 'ఇండియన్‌ అమెరికన్ విత్‌ ప్యూర్‌ గోల్డ్‌ ఫెరారీ కార్‌' అని నోట్‌ రాసి ఉంది.

దీనిపై ఆనంద్‌ మహీంద్రా తన ట్విటర్‌లో అసంతృప్తి వ్యక్తం చేశారు. డబ్బులు ఎలా ఖర్చు పెట్టకూడదో ఈ వీడియో చూసి తెలుసుకోవచ్చని వ్యాఖ్యానించారు. 'ఇది సామాజిక మాధ్యమాల్లో ఎందుకు చక్కర్లు కొడుతుందో నాకర్థం కావడం లేదు. మనం ధనవంతులమైనంత మాత్రాన డబ్బులు ఎలా ఖర్చు పెట్టకూడదో దీని ద్వారా మనం పాఠం నేర్చుకోవచ్చు. అందుకు తప్ప.. ఇంకా ఏ విషయంలో ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిందో?' అని ఆయన ట్విటర్‌లో వ్యాఖ్యానించారు. ఈ పోస్టులోని వీడియోను ఇప్పటి వరకు.. 2 లక్షల మందికిపైగా వీక్షించారు. వీరిలో 7,500 మందికిపైగా లైక్‌ చేశారు.

  • I don’t know why this is going around on social media unless it is a lesson on how NOT to spend your money when you are wealthy… pic.twitter.com/0cpDRSZpnI

    — anand mahindra (@anandmahindra) July 19, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చదవండి:కరోనా ప్రభావంతో అప్పుల తిప్పలు..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.