ETV Bharat / business

'అంబానీ ఎక్కడికీ వెళ్లడం లేదు.. ఆ వార్తలు అవాస్తవం' - ముకేశ్​ అంబానీ

భారత దిగ్గజ వ్యాపారవేత్త ముకేశ్​ అంబానీ.. తన కుటుంబంతో పాటు లండన్​కు(mukesh ambani london) రీలొకేట్​ అవుతున్నారన్న(mukesh ambani news) వార్తలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా.. ఈ వ్యవహారంపై స్పందించింది రిలయన్స్​. ముకేశ్​ అంబానీకి లండనే కాకుండా.. ప్రపంచంలోని ఏ ప్రాంతంలోనూ స్థిరపడాలన్న ఆలోచనే లేదని స్పష్టం చేసింది.

mukesh ambani london
అంబానీ
author img

By

Published : Nov 5, 2021, 10:35 PM IST

Updated : Nov 6, 2021, 4:56 AM IST

రిలయన్స్​ అధినేత ముకేశ్​ అంబానీ కుటుంబం.. బ్రిటన్​లో స్థిరపడాలి(mukesh ambani london) అనుకుంటోందని వచ్చిన వార్తలను ఆ సంస్థ ఖండించింది. అంబానీ కుటుంబానికి భారత్​ తప్ప మరే ఇతర దేశానికి రీలొకేట్​ అవ్వాలన్న ఆలోచనే లేదని తేల్చిచెప్పింది. ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేసింది(mukesh ambani house).

బ్రిటన్​లోని బకింమ్​షైర్​లో ఉన్న స్టోక్​ పార్క్​లో 300ఎకరాల్లో ఉన్న నివాసంలో ముకేశ్​ అంబానీ కుటుంబం శాశ్వతంగా స్థిరపడాలని యోచిస్తున్నట్టు పలు వార్తలు సామాజిక మాధ్యమాల్లో చెక్కర్లు కొట్టాయి. ఆ వార్తలు నిరాధారమని, పూర్తిగా ఊహాగానాలేనని రిలయన్స్​ స్పష్టం చేసింది.

"రిలయన్స్​ ఛైర్మన్​, ఆయన కుటుంబం.. లండన్​తో పాటు ప్రపంచంలోని మరే ఇతర ప్రాంతంలోనూ స్థిరపడాలని అనుకోవడం లేదు. ఈ విషయాన్ని సంస్థ స్పష్టం చేయాలని భావిస్తోంది."

-రిలయన్స్​ ప్రకటన.

లండన్​లోని స్టోక్​ పార్క్​ను అంబానీ కుటుంబం రూ.592కోట్లకు ఇటీవలే కొనుగోలు చేసింది. ఆ తర్వాత కుటుంబం విదేశీ పర్యటనకు వెళ్లింది. దీంతో కుటుంబం మొత్తం లండన్​కు రీలొకేట్​ అయిపోతుందని ఊహాగానాలు జోరందుకున్నాయి.

స్థానిక నిబంధనలకు కట్టుబడి.. స్టోక్​ పార్క్​ను గొప్ప గోల్ఫింగ్​, స్పోర్ట్​ రిసార్ట్​గా మలిచేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్టు సంస్థ తన ప్రకటనలో వెల్లడించింది. అయితే అంబానీ విదేశీ పర్యటనపై మాత్రం సంస్థ ఎలాంటి ప్రకటన చేయలేదు(reliance news today).

ఇదీ చూడండి:- 100 బిలియన్​ డాలర్ల ప్రత్యేక క్లబ్‌లోకి అంబానీ!

Last Updated : Nov 6, 2021, 4:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.