ETV Bharat / business

ఆ చిప్స్​​​ కొంటే.. 2 జీబీ డేటా ఉచితం

ఇకపై లేస్​, కుర్కురే, అంకుల్​ చిప్స్​ ప్యాకెట్లను కొన్న వారికి 2 జీబీ డేటాను అందించనుంది ప్రముఖ టెలికాం దిగ్గజ సంస్థ ఎయిర్​టెల్​. ఇందుకోసం పెప్సికో, ఎయిర్​టెల్ మధ్య ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం రూ.10 లేస్​ ప్యాకెట్​ కొన్న వారికి 1 జీబీ డేటా, రూ.20 ప్యాకెట్​కు 2జీబీ డేటా ఉచితంగా పొందవచ్చు.

Airtel Users Now Get up to 2GB Free Data with Lay's, Kurkure
లేస్ ప్యాకెట్​​ కొన్నవారికి 2 జీబీ డేటా ఉచితం
author img

By

Published : Sep 2, 2020, 6:04 PM IST

పెప్సికో-బ్రాండెడ్ స్నాక్స్ కొనుగోలు చేసినవారికి 2జీబీ వరకు ఉచిత డేటాను అందించనుంది ప్రముఖ టెలికాం దిగ్గజ సంస్థ ఎయిర్​టెల్​. ఇందుకోసం పెప్సికో ఇండియా, ఎయిర్‌టెల్‌ మధ్య ఒప్పందం కుదిరింది. లేస్, కుర్కురే, అంకుల్ చిప్స్, డోరిటోస్‌లను కొన్న వారికి ఈ ఆఫర్​ వర్తిస్తుందని వెల్లడించింది ఎయిర్​టెల్​.

ఈ ఆఫర్​ ప్రకారం రూ.10 ప్యాకెట్​ కొన్నవారికి 1 జీబీ డేటా, రూ. 20లకు 2 జీబీ డేటా ఉచితంగా అందించనున్నట్లు పేర్కొంది.
అయితే ఈ ఆఫర్​​ కేవలం కస్టమర్లు మూడు సార్లు మాత్రమే వినియోగించుకోవాలి. అంటే మూడు రూ.20 ప్యాకెట్లను కొన్నవారికి 6 జీబీ డేటా వస్తుంది. ఒక్కసారి కూపన్​ను స్కార్చ్​ చేసి కోడ్​ను ఎంటర్​చేస్తే మూడు రోజుల వరకు డేటా వ్యాలిడిటీ ఉంటుందని సంస్థ ప్రకటించింది.

ప్యాకెట్​లో వచ్చే సదరు కూపన్​ ద్వారా 4జీబీ డేటాను పొందవచ్చు. దీని కోసం ఎయిర్​టెల్ థ్యాంక్స్​ యాప్​లోని మై కూపన్​ సెక్షన్​లోకి వెళ్లి స్కాన్​ చేస్తే డేటా అవుతుందని సంస్థ పేర్కొంది.. ఈ కూపన్​ ఆఫర్​ 2021 జనవరి 31 వరకు వర్తిస్తుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.