కేంద్ర బడ్జెట్‌పై రాష్ట్ర ప్రభుత్వం పెదవి విరిచింది. ఏపీకి కేటాయింపులు నిరాశాజనకంగా ఉన్నాయని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. విభజన హామీలు పట్టించుకోలేదంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. బడ్జెట్ కేటాయింపులు పెంచమని కోరుతూ త్వరలోనే ప్రధాని సహా కేంద్రమంత్రులను సీఎం జగన్ కలుస్తారని బుగ్గన తెలిపారు.
పేద, మధ్యతరగతి ప్రజలకు బడ్జెట్ నిరాశ కలిగించిందని... దీర్ఘకాలిక ప్రాజెక్టులకే ప్రభుత్వం ప్రాధాన్యమిచ్చిందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో ఐదేళ్ల కాలంలో రైల్వేని అభివృద్ధి చేస్తామనడం తప్ప... ఎలాంటి ప్రణాళిక లేదన్నారు.
బడ్జెట్ ప్రోత్సాహకరంగా ఉందని... భారత పరిశ్రమల సమాఖ్య అభిప్రాయపడింది. మౌలిక సదుపాయల కల్పన, విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలను ప్రోత్సహించేలా పద్దులు ఉన్నాయని సీఐఐ ప్రతినిధులు అన్నారు. ఏపీకి కొంత ఆసరానిస్తే బాగుండేదన్నారు.
ఉన్నత విద్య ప్రోత్సహించే దిశగా కేటాయింపులు ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మహిళా ఆర్థికమంత్రి ప్రవేశపెట్టిన బడ్డెట్ మహిళలకు మేలు చేసే విధంగా ఉందని అంటున్నారు
.