ETV Bharat / briefs

జులైలో వైఎస్సార్ పింఛన్​ కానుక అందజేత: కలెక్టర్

ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు వైఎస్సార్ పింఛను కానుక జూన్ నుంచి ప్రారంభమౌతుందని కర్నూలు జిల్లా కలెక్టర్ తెలిపారు. పెంచిన పింఛను నగదును జులైలో అందజేయనున్నామని స్పష్టం చేశారు. వృద్ధాప్య పింఛను అర్హత వయస్సును 5 సంవత్సరాలు తగ్గించినట్లు కలెక్టర్ పేర్కొన్నారు.

కర్నూలు జిల్లా కలెక్టర్ సత్యనారాయణ
author img

By

Published : May 31, 2019, 5:49 PM IST

కర్నూలు జిల్లా కలెక్టర్ సత్యనారాయణ

వైకాపా ప్రభుత్వం తాజాగా ప్రకటించిన వైఎస్సార్ పింఛను కానుక...రేపట్నుంచి అమల్లోకి వచ్చి జులైలో నగదు అందుతుందని కర్నూలు జిల్లా కలెక్టర్ సత్యనారాయణ తెలిపారు. ప్రభుత్వం ప్రకటించినట్లుగా వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు, మత్స్యకారులకు పింఛన్ల మొత్తంతో కలిపి పెంచిన రూ.250 అందుతాయని చెప్పారు. ఈ మొత్తాన్ని జూన్, జులై నెలకు కలిపి జూలై నెలలో రూ.2500 ఇవ్వనున్నట్లు తెలిపారు. జూన్ నెలలో మాత్రం పింఛన్లు రూ. 2 వేలు ఇస్తున్నామని స్పష్టం చేశారు. కిడ్నీ రోగుల పింఛన్​ రూ. 10 వేలకు పెంచినట్లు తెలిపారు. వృద్ధాప్య పింఛన్ల అర్హుల వయస్సును 65 నుంచి 60 ఏళ్లకు ప్రభుత్వం తగ్గించినట్లు తెలిపిన ఆయన... అర్హులు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. దివ్యాంగులకు రూ. 3 వేలు పింఛను అందించనున్నామని తెలిపారు.

ఇవీ చూడండి : సీఎం జగన్​తో ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి భేటీ

Intro:333

Body:6544

Conclusion:కడప జిల్లా దట్టమైన నల్లమల అడవి ప్రాంతంలో వెలసిన న జ్యోతి క్షేత్రం పర్యాటక రంగం అభివృద్ధికి దూరంగా ఉంది. ఏటా ఇక్కడ జరిగే ఆరాధనోత్సవాలకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల నుంచి చి పర్యాటకులు విశేషంగా వస్తారు .ఇతర రోజుల్లో కూడా టూరిస్టు బస్సులు ,ఆర్టీసీ బస్సులు, కార్లు జీవులలో యాత్రికులు వచ్చి వెళ్తున్నారు .ఇక్కడ ఆహ్లాదం కలిగించే అంశాలు ఏవి లేకపోవడంతో కేవలం దేవాలయం చూసి ని నిరాశతో విను తిరుగుతుంటారు .ఇక్కడ పురాతన కాలం నాటి జ్యోతి నరసింహ స్వామి క్షేత్రం తో పాటు భక్తుడు కాసినాయన ఆలయం కూడా ఉంది . 2018 లో తెదేపా ప్రభుత్వం హయాంలో 2 కోట్లతో అటవీశాఖ అధికారులు పర్యాటక కేంద్రం రూపకల్పన చేశారు. జ్యోతి క్షేత్రానికి ప్రధాన రహదారి ప్రక్కనే వంద అడుగుల ఎత్తయిన కొండపై 50 హెక్టార్లు స్థలం సేకరణ చేశారు. ఇక్కడ పర్యాటకుల కోసం కుటీరాలు, మ్యూజియం ,అటవీ చట్టాలపై అవగాహన కల్పించేందుకు హోర్డింగులు, పార్కు నిర్మించ తలపెట్టారు. పర్యాటక భవనం, రహదారి విద్యుదీకరణ తాగునీటి సౌకర్యం ఇలాంటి నాలుగు లక్షల విలువైన పనులు జరిగాయి. సకాలంలో నిధులు విడుదల కాకపోవడంతో తక్కిన పనులు కార్యరూపం దాల్చలేదు.. ఎన్నికల కోడ్ వచ్చే ముందు 70 లక్షల నిధులు విడుదల అయ్యాయి. సకాలంలో నిధులు వచ్చి ఉంటే పనులు ఏడాదిలోపు జరిగేవి. నిధులు ఆలస్యంగా రావడంతో పనులు సకాలంలో పూర్తి చేయలేని పరిస్థితి నెలకొంది. దీంతో అటవీ శాఖ అధికారులు వచ్చిన నిధులను ప్రభుత్వానికి వెనక్కు కట్టేశారు .దీంతో ఈ పర్యాటక కేంద్రం అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. ఇప్పటికైనా నూతనంగా ఎన్నికైన పాలకులు దీని ప్రగతి పై దృష్టి సారించాలని పర్యాటకులు కోరుతున్నారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.