తాళ్లూరు కస్తూరిభా గాంధీ బాలికల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న శ్రావణికి క్రీడలపై ఆసక్తి ఎక్కువ. ఈ విషయాన్ని గమనించిన వ్యాయామ ఉపాధ్యాయురాలు లక్ష్మీ.. శ్రావణికి యోగా శిక్షణ ఇచ్చి మెళకువలు నేర్పారు. మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి యోగా పోటీల్లో మెరుగైన ప్రదర్శనలు ఇచ్చిన ఈ బాలిక జాతీయస్థాయి పోటీలకు ఎంపికైంది.
జాతీయ స్థాయిలో గెలుపు
ఈ నెల 9 నుంచి మూడ్రోజులపాటు మధ్యప్రదేశ్ ఇండోర్లో జరిగిన యోగా పోటీల్లో రాష్ట్రం తరఫున పాల్గొని తృతీయస్థానం సాధించింది. మారుమూల గ్రామం నుంచి జాతీయస్థాయి వరకూ ఎదిగిన ఈ చిన్నారి మరిన్నీ విజయాలు సాధించాలని తోటి విద్యార్థులు, పాఠశాల సిబ్బంది కోరుకుంటున్నారు.
వ్యాయామ ఉపాధ్యాయురాలు శిక్షణ
సదుపాయాలు అంతతం మాత్రమే ఉన్న పాఠశాలలో విద్యార్థులకు యోగా పట్ల ఆసక్తి గమనించి అందులో శిక్షణ ఇస్తున్నారు యోగా ఉపాధ్యాయురాలు లక్ష్మి. కఠినమైన యోగాసనాలను సులభంగా వేసేలా బాలికలకు మెళకువలు నేర్పుతున్నారు.