తెదేపా సిట్టింగ్ ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం తెదేపా సిట్టింగ్ ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి పేరిట గుర్తు తెలియని వ్యక్తులు అనుచిత ఫ్లెక్సీలు పెట్టారు. నియోజకవర్గంలోని రాజులపాలెం, చిన్నపాలెం, ఇసుకపూడి పుల్లేటికుర్రు గ్రామాల్లో ఎమ్మెల్యేపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఫ్లెక్సీలు వెలిశాయి. ఈ ఘటనతో మనస్థాపానికి గురైన శాసనసభ్యుడు అంబాజీపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫ్లెక్సీల వివాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేపట్టారు.
ఇవీ చూడండి
ఇమామ్‌ల పింఛన్.. 10 వేలకు పెంచుతాం: సీఎం