ట్రంప్ మాజీ ప్రధాన వైద్యులు రాన్నీ జాక్సన్ గతంలోనూ ఇదే విషయాన్ని తెలిపారు. అధ్యక్షుడి ఆరోగ్య చిట్కా ఆయన 'జీన్స్' అని జాక్సన్ చెప్పారు.
"అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యం మంచిస్థితిలో ఉంది. అధ్యక్ష పదవీకాలంతో పాటు ఆ తర్వాత కూడా ఆరోగ్యంగానే ఉంటారనుకుంటున్నా."
- సీన్ కాన్లే, శ్వేతసౌధం ప్రధాన వైద్యుడు
తన ఆరోగ్య పరిస్థితిపై ట్రంప్ స్పందించారు.
ఎప్పుడూ వ్యాయామం చేసే నా స్నేహితుల్లో చాలా మంది మోకాళ్లు, నడుము శస్త్రచికిత్సలు చేయించుకున్నారు. వారందరికీ వ్యాయామం మంచి ఫలితాన్ని ఇవ్వలేదు. శ్వేతసౌధం చుట్టూ నడవడం, బహిరంగ సభల్లో నిలబడటమే నేను చేసే ప్రధాన వ్యాయామాలు.
-డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు
ట్రంప్...పొగకు దూరం
ట్రంప్ ఇంతవరకూ పొగతాగలేదు. బీర్ కూడా ఎప్పుడూ సేవించలేదని తెలిపారు వైద్యులు. ట్రంప్ ఆహార మెనూలో బీఫ్, కోక్ తప్పక ఉండాల్సిందేనని చెప్పారు.