విశాఖ (దక్షిణ) ఎమ్మెల్యే అభ్యర్థుల ముఖాముఖి వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం ఒకే వేదికపైకి ఎమ్మెల్యే అభ్యర్థులను తీసుకొచ్చింది. విశాఖ దక్షిణ నియోజకవర్గ పోటీలో నిలిచిన పలు పార్టీల నేతలతో ముఖాముఖి నిర్వహించింది. ప్రధాన పార్టీలైన తెదేపా, వైకాపా, భాజపా, కాంగ్రెస్ అభ్యర్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తమను గెలిపిస్తే.. భవిష్యత్తులో అభివృద్ధి ఎలా చేస్తామనే అంశంపై మాట్లాడారు. పోర్టులో కాలుష్యం, తాగునీరు, నిరుద్యోగ సమస్యలను అధిగమిస్తామని వివరించారు. ఇలాంటి కార్యక్రమాల వల్ల ఎవరిని ఎన్నుకోవాలి అనే విషయంపై స్పష్టత వస్తుందని నిర్వాహకులు అభిప్రాయపడ్డారు.
ఇవీ చదవండి...నర్సీపట్నం నియోజకవర్గ పోరులో 8 మంది!